పర్‌ఫెక్ట్‌ పార్ట్‌నర్‌తో బీచ్‌ ఒడ్డున పిక్‌నిక్‌.. ఇంకేం కావాలి: కీర్తి సురేశ్‌

Keerthi Suresh Shares Her Picnic Photos With Her Pet Nick - Sakshi

మహానటి కీర్తి సురేశ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫుల్‌ సందడి చేస్తోంది. తన వ్యక్తి గత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ, తరచూ యోగా, ఫిట్‌నెస్‌ వీడియోలను షేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. దీంతో ఆమె వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వరల్డ్‌ పిక్‌నిక్‌ డేకు తనకు సరైన తోడు దొరికిందంటూ పిక్‌నిక్‌ వెళ్లిన ఫొటోలను షేర్‌ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫొట్లోలు వైరల్‌ అవుతున్నాయి.  

‘సరైన తోడు, ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్‌ తీరాన పిక్‌నిక్‌ ఇంతకంటే ఇంకేం కావాలి’ అంటూ కీర్తి తన పెంపుడు కుక్క నైక్‌తో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. కాగా కీర్తి సురేశ్‌ ప్రస్తుతం మహేశ్‌ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె తాజాగా నటించిన‘గుడ్ లక్ సఖి’  విడుదలకు సిద్దంగా ఉంది. అయితే తన నటించిన ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ తరహాలోనే గుడ్ లక్ సఖి కూడా ఓటీటీలో రాబోతోందంటూ రూమార్స్‌ వచ్చాయి. అయితే మేకర్స్ ఈ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top