Kaushal Manda: తండ్రికి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన కౌశల్‌..

Kaushal Manda Gifts New Home To His Father - Sakshi

బిగ్‌బాస్‌ విన్నర్‌, నటుడు కౌశల్‌ మండా తన తండ్రికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. ఓ కొత్త ఫ్లాట్‌ను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. తండ్రికి ఒక్కమాట కూడా చెప్పకుండా ఆ కొత్తింటికి ఆయన్ను తీసుకువచ్చి ఇదే నీ ఇల్లు డాడీ అంటూ సర్‌ప్రైజ్‌ చేశాడు. ఊహించని సర్‌ప్రైజ్‌తో కౌశల్‌ తండ్రి ఆనందాశ్చర్యంలో తేలిపోయాడు. కాగా 2021లో ఫాదర్స్‌ డే రోజు కౌశల్‌ తండ్రి నాకంటూ ఓ చిన్ని ఇల్లు కావాలి అని అడిగాడు. అప్పటినుంచి అదే మనసులో పెట్టుకున్న నటుడు ఎట్టకేలకు ఈ ఏడాది హైదరాబాద్‌లో ఆయనకు ఓ ఇల్లు కొనిచ్చాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఫైనల్‌గా నా బాధ్యత తీరిపోయింది. నాన్న వైజాగ్‌లో ఇల్లు కావాలని అడిగాడు. కానీ నాన్న హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడే సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కొన్నాను. 2023 ప్రారంభంలోనే ఇల్లు కొనేశాను. ఆయనకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు. ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకుంటూ గృహప్రవేశం వీడియోను షేర్‌ చేశాడు. ఇది చూసిన అభిమానులు 'తండ్రి కల నెరవేర్చావు, గ్రేట్‌', 'మాట మీద నిలబడ్డావన్నా' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top