రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్‌కు తీవ్ర గాయాలు | Kathi Mahesh Car Accident: Admitted In Hospital, Check Health Condition | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్‌కు తీవ్ర గాయాలు

Jun 26 2021 10:48 AM | Updated on Jun 26 2021 6:19 PM

Kathi Mahesh Car Accident: Admitted In Hospital, Check Health Condition - Sakshi

సాక్షి, నెల్లూరు: ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, నటుడు కత్తి మహేశ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. దీంతో మహేశ్‌ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎడమ కంటికి తీవ్రగాయమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ ఘటనలో కత్తి మహేశ్‌ కారు నుజ్జు, నుజ్జు అయింది.  

పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో కత్తి మహేశ్‌ పాపులర్‌ అయ్యారు. రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గతంలో ఆయన హైదరాబాద్‌ నగర బహిష్కరణకు కూడా గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement