Kartik Aaryan Opened Up About Fake News About Him Marrying Fan - Sakshi
Sakshi News home page

Kartik Aaryan: అభిమానితో నా పెళ్లి చేశారు!

Jan 16 2022 1:03 PM | Updated on Jan 16 2022 2:08 PM

Kartik Aaryan Opened Up About Fake News About Him Marrying Fan - Sakshi

'ఒక‌సారి ఏం జ‌రిగిందంటే నా సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో లేడీ ఫ్యాన్ ఒక‌రు న‌న్ను పెళ్లి చేసుకోమ‌ని అడిగింది. అంతే,..

సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఉన్న‌ది లేన‌ట్టు, లేనిది ఉన్న‌ట్లు చెప్ప‌డం కామ‌న్ అయిపోయింది. జ‌రిగింది ఒక‌టైతే దాన్ని ఇంకోలా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సెల‌బ్రిటీల‌పై అనేక త‌ప్పుడు క‌థ‌నాలు వెలువడ్డాయి. అలా ఒక‌సారి యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ గురించి ఓ వార్త వైర‌ల్ అయింది.ఈ హీరో త‌న అభిమానిని పెళ్లి చేసుకున్నట్లు ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో దీని గురించి ప్ర‌స్తావించాడు కార్తీక్‌.

'ఒక‌సారి ఏం జ‌రిగిందంటే నా సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో లేడీ ఫ్యాన్ ఒక‌రు న‌న్ను పెళ్లి చేసుకోమ‌ని అడిగింది. అంతే, ఆ మాత్రానికే ఏకంగా నేను ఆమెను పెళ్లి చేసుకున్న‌ట్లు వార్త‌లు రాశారు. అది చూసి నేను బిగ్గ‌ర‌గా న‌వ్వుకున్నాను. ఏంటి, మీక‌లా అనిపించిందా? అనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ యంగ్ హీరోను ఆరాధించే అభిమానులు చాలామందే ఉన్నారు. ఈ మ‌ధ్యే ఓ అభిమాని కార్తీక్ ఆర్య‌న్ ముఖాన్ని త‌న ఛాతీపై ప‌చ్చ‌బొట్టు వేయించుకున్న విష‌యం తెలిసిందే!

Advertisement
 
Advertisement
Advertisement