మరో సీరియల్‌ కోసం గెటప్‌ మార్చిన వంటలక్క, స్టైలిష్‌ లుక్‌తో..

Karthika Deepam Serial Fame Premi Viswanath Act In Malayam Serial - Sakshi

కార్తీకదీపం ఫేం దీప(ప్రేమి విశ్వానాథ్‌) తెలుగు బుల్లితెర ప్రేక్షకులుకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వంటలక్కగా పాపులర్‌ అయిన ఆమె చీరకట్టులో అనుకువ, సహనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కార్తీకదీపం ట్వీస్ట్‌లతో సాగుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్‌, మోనితల రిజిస్టర్‌ మ్యారేజ్‌ గురించి ఉత్కంఠం సాగుతున్న ఈ సీరియల్‌ను డైరెక్టర్‌ ఎలా మలుపు తిప్పబోతున్నాడనేది ఎవరి ఊహాకు అందడం లేదు. దీంతో కొంతమంది ‘కార్తీక్‌, మోనిత పెళ్లి అయిపోతుంది, ఆ తర్వాత వంటలక్క వెళ్లిపోతుంది.. వెంటనే కార్తీకదీపంకు శభం కార్డు’ అంటూ చర్చించుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా ప్రేమి విశ్వనాథ్‌ నటిగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఆమె ఇంతవరకు వేరే సీరియల్‌ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ మాలయాళ సీరియల్‌కు సంతకం చేసింది. ప్రేమి లీడ్‌ రోల్‌లో దేవికా అనే సీరియల్‌ ప్రాసారం కాబోతుంది. ఈ సీరియల్‌కు సంబంధించిన ప్రోమోను ఆమె తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. ఇందులో వంటలక్క సరికొత్త లుక్‌లో దర్శనం ఇచ్చింది. మోడ్రన్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ లుక్‌తో అందరికి షాక్‌ ఇచ్చింది. 

ఈ సీరియల్‌ పేరు దేవికా అని, సోమవరం (జూలై 5) నుంచి రాత్రి 8 గంటలకు సూర్య టీవీ ప్రసారం అవుతున్నట్లు ఈ ప్రమోలో ప్రేమి వెల్లడించింది. కార్తీకదీపంలో చాలా పద్దతిగా, సంప్రదాయం ఉన్న వంటలక్కను ఇలా చూసి ఆమె అభిమానులంతా షాక్‌ అవుతున్నారు. ఈ ప్రోమో చూస్తుంటే ప్రేమి విశ్వనాథ్‌లో ఇందులో పోగరు ఉన్న సంపన్నురాలిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు బాష అర్థంకాకపోయిన వంటలక్క కోసం సీరియల్‌ చూసేందుకు అసక్తిచూపుతున్నారట. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top