కంగనాకి అక్షయ్‌ కుమార్‌ సీక్రెట్‌ కాల్‌!

Kangana Ranaut Says Got Secret Calls From Big Stars Like Akshay Kumar Praising Thalaivi Trailer - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరో బాంబు పేల్చింది. ఎప్పటిలాగే బాలీవుడ్‌ మాఫియాలను టార్గెట్‌ చసే కంగనా.. ఈ సారి ఆ వివాదంలోకి ఖిలాడి అక్షయ్‌ కుమార్‌ని లాగింది. అక్షయ్‌ లాంటి టాప్‌ స్టార్స్‌ అంతా తనకు రహస్యంగా ఫోన్‌ చేసి ప్రశంసించారని చెప్పుకొచ్చింది. కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘తలైవి’. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు మంచి స్పందన లభించింది. జయలలిత పాత్రలో కంగనా ఒదిగిపోయింది. ఆడియన్స్, క్రిటిక్స్ ఇద్దరి నుంచీ మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, బాలీవుడ్ పెద్దలు మాత్రం ఎప్పటిలాగే సైలెంట్ గా ఉండిపోయారు.

ఈ నేపథ్యంలో కంగనా తాజాగా తనకు వచ్చిన సీక్రెట్‌ కాల్స్‌ గురించి సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇండస్ట్రీలోని చాలా మంది తనకు సీక్రెట్‌గా అభినందనలు తెలిపారని చెప్పింది. కానీ, దీపిక, ఆలియా భట్ లాంటి వారి సినిమాలకు వచ్చినట్టు తన చిత్రాలకి పబ్లిగ్గా పొగడ్తలు రావని చెప్పింది. అయితే కంగనా చెప్పినదాంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే అక్షయ్‌ కుమార్‌ స్పందించేవరకు చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top