‘సుశాంత్‌-సారా విడిపోవడానికే వారే కారణం’

Kangana: Kareena Kapoor Told Sara Ali Khan Dont Date Your First Hero - Sakshi

ముంబై : బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మాటల దాడికి దిగుతూ అందరిని ఏకిపారేస్తున్నారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మ‌ర‌ణం త‌ర్వాత కంగ‌నా సెల‌బ్రిటీల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే రోజు తన ఘాటైన వ్యాఖ్యలతో బీటౌన్‌ను షేక్‌ చేస్తున్న కంగనా మరోసారి రెచ్చిపోయారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, సారా అలీ ఖాన్‌  సంబంధంపై నోరు విప్పారు. ఇంతకముందు కూడా సుశాంత్‌ సారా వీడిపోవడానికి బాలీవుడ్‌ బంధుప్రీతి‌ కారణమని కంగనా చెప్పిన విషయం తెలిసింతే. తాజాగా ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. సుశాంత్ సారాతో డేటింగ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్‌ సెలబ్రిటీలు వారు విడిపోయేలా చేశారని పేర్కొన్నారు. (‘ఐటెమ్‌ సాంగ్‌ ఛాన్స్‌ రావాలంటే అలా చేయాలసిందే’)

ఇపుడు ఇదే గ్యాంగ్ మూవీ మాఫియా తనను కూడా ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని కంగ‌నా ర‌నౌత్ స్పష్టం చేశారు. సుశాంత్‌తో డేటింగ్‌ చేయవద్దని  సారాను కరీనా కపూర్‌ కోరినట్లు పేర్కొన్నారు. ‘నీ మొదటి హీరోతో డేటింట్‌ చేయకు’ అని కరీనా చెప్పిన రికార్డ్‌ కూడా ఉందన్నారు. సుశాంత్‌ బయటి వ్యక్తి కాబట్టి అతన్ని ఇండస్ట్రీ ఎగతాళి చేసిందని, మూవీ మాఫియా బ‌హిరంగంగానే అతనిని హ‌త్య చేసిందన్నారు. దాంతో మానసిక కుంగుబాటుకు లోనైన సుశాంత్‌పై రాబంధుల స‌మూహం వ‌చ్చి అనుకున్నది చేసిందన్నారు. కాగా  2018 లో సుశాంత్‌తో కలిసి ‘ కేదార్‌నాథ్‌’ సినిమాతో సారా సినీరంగ ప్రవేశం చేశారు. (బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్‌.. డ్రగ్స్‌...)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top