ఆయనతో పని చేయాలన్నది నా కల

Kala Bhairava About NTR At Thellavarithe Guruvaram Pre Release Event - Sakshi

‘‘స్టూడెంట్‌ నెం 1’ నుంచి తారక్‌తో (జూనియర్‌ ఎన్టీఆర్‌) మా అనుబంధం కొనసాగుతోంది. అందుకే ‘తెల్లవారితే గురువారం’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో భావోద్వేగంతో మాట్లాడారు.. ఎప్పటికైనా ఆయన సినిమాకి సంగీతం అందించాలన్నది నా కల’’ అని సంగీత దర్శకుడు కాలభైరవ అన్నారు. కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కోడూరి హీరోగా, చిత్రా శుక్లా, మిషా నారంగ్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’.

కీరవాణి మొదటి కుమారుడు కాలభైరవ సంగీతదర్శకుడు. మణికాంత్‌ దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా రేపు (శనివారం) రిలీజవుతోంది. కాలభైరవ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అంటే, తమ్ముడికి నటనంటే ఇష్టం. అందుకే బాల నటుడిగా ‘యమదొంగ, విక్రమార్కుడు, మర్యాద రామన్న, ఈగ’ వంటి చిత్రాల్లో నటించాడు. నటనలో శిక్షణ తీసుకున్నాడు.

సంగీత దర్శకుడిగా నేను, హీరోగా సింహా ఒకే సినిమాతో (‘మత్తు వదలరా’) పరిచయమవుతామని ఊహించలేదు. తన రెండో సినిమాకి (‘తెల్లవారితే గురువారం’) కూడా నేనే సంగీతం అందిస్తాననుకోలేదు. సింహా నటించనున్న మూడో చిత్రానికి కూడా నేనే మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఒక్క రాత్రిలో జరిగే కథే ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్‌ వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ‘లక్ష్య, గుర్తుందా శీతాకాలం, కార్తికేయ 2’ సినిమాలు చేస్తున్నాను. అలాగే నివేదా పేతురాజ్‌ నటిస్తున్న ఓ వెబ్‌ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నాను. వీటితో పాటు మరో రెండు సినిమాలున్నాయి’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top