సిగరెట్‌ కాల్చిన కాజల్‌.. అభిమానులు షాక్‌ | Kajal Aggarwal Smoking In Web Series Netizens Shock | Sakshi
Sakshi News home page

సిగరెట్‌ కాల్చిన కాజల్‌.. అభిమానులు షాక్‌

Feb 13 2021 10:38 AM | Updated on Feb 13 2021 1:04 PM

Kajal Aggarwal Smoking In Web Series Netizens Shock - Sakshi

కాజల్‌ సిగరేట్‌ కాల్చుతున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

పెళ్లి అనంతరం హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ తన కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేకుండా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తోన్న ‘ఆచార్య’తో పాటు మంచు విష్ణు మోస‌గాళ్లులో న‌టిస్తోంది. అలాగే త‌మిళ్‌లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌సన ఇండియ‌న్ 2లో న‌టిస్తున్న విషయం తెలసిందే. అలాగే హిందీలో ముంబ‌యి సాగ‌లో కూడా క‌నిపించ‌నుంది. చేతిలో బోలెడు సినిమాలు పెట్టుకున్న చందమామ కెరీర్‌ పరంగా ఎలాంటి అవకాశాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే తొలిసారి ఓ వెబ్ సిరీస్‌తో అభిమానుల‌ను పలకరించడానికి రెడీ అవుతోంది. 

‘లైవ్ టెలికాస్ట్‌’ పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్‌లో కాజల్‌ నటిస్తోంది. దీనిని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. ఈ వెబ్ సిరీస్‌లో కాజల్ జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనుంది. అయితే ఇందులో దెయ్యం తరహా పాత్రలో ఈ భామ అలరించనున్నట్టు తెలుస్తోంది. లైవ్‌ టెలికాస్ట్ ఫిబ్రవరి 12న (శుక్రవారం)  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో కాజల్‌  నటన అద్భుతంగా ఉందంటూ పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటుంది. కాగా ఇప్పటి వరకు అన్ని జానర్స్‌లో నటించిన ఈ భామ హార్రర్ జానర్‌లో మాత్రం చేయలేవు. ఈ వెబ్ సిరీస్‌తో ఆ లోటు తీరబోతుందని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా కాజల్‌.. చేతిలో సిగరెట్‌ పట్టుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ముద్దుగుమ్మ సిగరెట్‌ కాల్చడం ఏంటని అభిప్రాయపడుతున్నారు. కానీ వాస్తవానికి  కాజల్‌ నిజంగా ధుమపానం చేసినప్పటికీ అది వెబ్‌ సిరీస్‌లో భాగంగానే అలా చేసింది. సిరీస్‌లో కొన్ని మాస్‌ సీన్స్‌లో కాజల్‌ సిగరెట్‌ కాల్చే సందర్భాలు ఉన్నాయి. అందుకే అకా కనిపించింది. అసలు విషయం తెలుసుకున్న కొంతమంది హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంటే మరికొంతమంది నెటిజన్లు సిరీస్‌లో అయినా మన మిత్రవింద ఇలా చేయడం ఏమాత్రం బాలేదని పెదవి విరుస్తున్నారు.
చదవండి: పెళ్లికీ వృత్తికీ సంబంధం ఏంటి? అది పర్సనల్
కేబుల్‌ వైర్లతో కట్టేసి కొరడాతో కొట్టేవాడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement