సినిమా అట్టర్‌ ఫ్లాప్‌.. ఏళ్ల తరబడి మాటల్లేవ్‌ | John Abraham and Nikkhil Advani Didn't Speak After Salaam-E-Ishq Flop | Sakshi
Sakshi News home page

సినిమా ఫ్లాప్‌.. హీరో- డైరెక్టర్‌ కటీఫ్‌.. దశాబ్దం తర్వాతే కుదిరిన దోస్తీ

Aug 17 2024 4:21 PM | Updated on Aug 17 2024 4:40 PM

John Abraham and Nikkhil Advani Didn't Speak After Salaam-E-Ishq Flop

సినిమా ఫెయిలైతే బాధపడనివారు ఎవరుంటారు? కానీ ఇక్కడ హీరో, దర్శకుడు బాధతో కొన్ని ఏండ్లపాటు మాట్లాడుకోకుండా ఉన్నారు. వాళ్లే హీరో జాన్‌ అబ్రహం, డైరెక్టర్‌ నిఖిల్‌ అద్వాణీ. వీరిద్దరూ 2007లో వచ్చిన సలాం ఇ ఇష్క్‌ సినిమాకు కలిసి పని చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా వర్కవుట్‌ కాకపోవడంతో ఇద్దరూ మాట్లాడుకోలేదు. 

మాటల్లేవ్‌..
ఈ విషయాన్ని నిఖిల్‌ అద్వాణీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సలాం ఇ ఇష్క్‌ తర్వాత మేము సత్యమేవ జయతే సినిమా టైంలోనే మళ్లీ కలుసుకున్నాం. ఆ మధ్య కాలంలో తన పని తాను చూసుకున్నాడు, నా పని నేను చూసుకున్నాను. మేమసలు మాట్లాడుకోనేలేదు. సలాం.. ఫెయిల్యూర్‌తో నేను ముంబై వదిలేసి అలీబాగ్‌కు వెళ్లిపోయాను. 

అన్నింటికీ దూరంగా..
ఎవరితో మాట్లాడలేదు. ఆఖరికి నా కూతురితో కూడా మాట్లాడలేదు. అందరికీ, అన్నింటికీ దూరంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా జాన్‌-నిఖిల్‌ కాంబినేషన్‌లో 2018లో సత్యమేవ జయతే సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. వీరి కాంబోలో వచ్చిన మూడో చిత్రం వేద. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది.

చదవండి: ఎప్పుడూ ఏడుపుగొట్టు సీన్లు.. ఇక నావల్ల కాదు: మీర్జాపూర్‌ నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement