Jenifer Emmanuel Talks About Nachindi Girlfriend Movie - Sakshi
Sakshi News home page

Nachindi GirlFriend: ఆ సీన్‌ కోసం తక్కువ తిన్నా: హీరోయిన్‌

Nov 9 2022 8:32 AM | Updated on Nov 9 2022 9:18 AM

Jennifer Emmanuel Talks About Nachindi Girlfriend Movie - Sakshi

ఉదయ్‌ శంకర్, జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ జంటగా గురుపవన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నచ్చింది గాళ్‌ ఫ్రెండూ’. ఆర్‌ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో జెన్నిఫర్‌ మాట్లాడుతూ – ‘‘నా స్వస్థలం ముంబై. ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో మాస్టర్స్‌ చేసిన తర్వాత జర్నలిజంలో డి΄÷్లమా కోర్సు చేశాను. ఆ తర్వాత యాక్టింగ్‌ కోర్సులో జాయిన్‌ అయ్యాను. వెస్ట్రన్‌ డాన్సులతో ΄ాటు భరత నాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాను.

అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నాకు ‘బాయ్స్‌ విల్‌ బీ బాయ్స్‌’ అనే తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే సినిమాటోగ్రాఫర్‌గా చేసిన మనోహర్‌గారు ‘నచ్చింది గాళ్‌ ఫ్రెండూ’కు నన్ను ప్రిఫర్‌ చేశారు. ఈ చిత్రంలో రెండు షేడ్స్‌ ఉన్న సంధ్య అనే  పాత్ర చేశాను. కొన్ని సన్నివేశాల కోసం బికినీ ధరించాను. అయితే దర్శకుడు నన్ను అందంగా చూపించారు కానీ అసభ్యంగా చూపించలేదు. అలాగే ఓ సీన్‌ కోసం రెండు రోజులు చాలా తక్కువ ఫుడ్‌ తీసుకున్నాను. దర్శకులు గురు పవన్‌గారికి కథ పట్ల మంచి క్లారిటీ ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరో ఎన్టీఆర్, హీరోయిన్స్‌లో సమంత అంటే ఇష్టం’’ అని అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement