సినిమా వాళ్లతో డేటింగ్‌ చేయను, ఎందుకంటే..: జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor Says She Never Date An Actor - Sakshi
Sakshi News home page

సినిమా వాళ్లతో డేటింగ్‌ చేయను, ఎందుకంటే..: జాన్వీ కపూర్‌

Published Sat, Jan 6 2024 6:17 PM

Janhvi Kapoor Say s She Never Date An Actors - Sakshi

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్‌ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. దఢక్ సినిమాతో హీరోయిన్ గా మారిన జాన్వీ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూబాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తుంది. త్వరలోనే టాలీవుడ్‌ తెరపై కూడా సందడి చేయబోతుంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే జాన్వీ ఆమె సోదరి ఖుషీ కపూర్ ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’కి గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డేటింగ్‌ పై తన అభిప్రాయం ఏంటో చెప్పింది.  సినిమా వాళ్లతో డేటింగ్‌ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పేసింది. ‘డేటింగ్‌ చేసేవాళ్లకు నేనే ప్రపంచమై ఉండాలి. ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేయాలి. సినీ రంగంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఒకే వృత్తిలో ఉండేవాళ్లు దాన్ని బ్యాలెన్స్‌ చేయడం కష్టం. అందుకే నేను సినిమా వాళ్లతో డేటింగ్‌ చేయను’అని జాన్వీ చెప్పుకొచ్చింది.

(చదవండి: అమ్మ నన్ను తిట్టేది: జాన్వీ)

Advertisement
 
Advertisement
 
Advertisement