ప్రముఖ నిర్మాత కార్యాలయంలో ఐటీ సోదాలు | IT Raids on Tiger Nageswara Rao Movie Producer Abhishek Agarwal Office - Sakshi
Sakshi News home page

IT Raids: టైగర్‌ నాగేశ్వరరావు నిర్మాత కార్యాలయంలో ఐటీ సోదాలు..

Published Wed, Oct 11 2023 12:43 PM

IT Raids on Abhishek Agarwal Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కార్యాలయంలో ఆదాయపన్నుశాఖ సోదాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఐటీ బృందం అభిషేక్‌ కార్యాలయంలో సోదాలు జరుపుతోంది. కాగా ఈ బ్యానర్‌లో మాస్‌ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కానుంది.

సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల గడువు మాత్రమే ఉన్న తరుణంలో అభిషేక్‌ కార్యాలయంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా అభిషేక్‌ అగర్వాల్‌ గతేడాది బ్లాక్‌బస్టర్‌ సినిమాలను నిర్మించాడు. ద కశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2, ధమాకా చిత్రాలన్నీ ఈయన బ్యానర్‌ నుంచి వచ్చినవే!

Advertisement
 
Advertisement