లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె

Ira Khan Shares A Video For Netizens Over Questioned About Her Depression - Sakshi

మానసిక ఒత్తికి కారణాలపై వీడియో షేర్‌ చేసిన ఇరా!

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమిర్‌ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్‌ తన మానసిక ఒత్తడిపై తాజాగా ఓ వీడియో సందేశాన్ని పంచుకుంది. ఇటీవల ప్రపంచ  మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్బంగా తను నాలుగేళ్లకు పైగా  డిప్రెషన్‌కు గురైనట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి ఆమె ఒత్తిడికి గల కారణాలు చెప్పాలంటూ నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యలో ఇరా సోమవారం నెటిజన్‌ల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పంచుకున్నారు. పది నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఇరా తన మానసిక ఒత్తిడికి గల కారణాలపై మాట్లాడింది. ‘కొద్ది రోజులుగా నా మానసిక అనారోగ్యానికి గల కారణాలను వెతకడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ దానికి తగిన కారణాలు నాకు దొరకడం లేదు. అందుకే మీకు సమాధానం చెప్పలేకపోతున్న. ఎందుకంటే నాకు అన్ని సౌకర్యాలు లభించాయి’ అని చెప్పుకొచ్చింది. (చదవండి: నాలుగేళ్లు డిప్రెష‌న్‌లో ఉన్నా: హీరో కూతురు)

అంతేగాక  ‘మూడున్నరేళ్ల క్రితం ఎప్పుడైతే నా ప్రవర్తన మారడం ప్రారంభమైందో నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడం మానేశాను. ఎదో విషయంపై దీర్ఘంగా ఆలోచించేదాన్ని. ఒంటరిగా గదిలోనే ఉండేదాన్ని. ఎక్కవ సమయంలో నిద్రపోయోదాన్ని. అసలు నా గది, మంచం వదిలి ఎక్కువగా బయటకు వచ్చేదాన్ని కాదు. దీర్ఘంగా ఆలోచిస్తూ అలా మంచంపైనే ఉండేదాన్ని. కానీ అది ఉపయోగపడే విషయం కూడా కాదని తర్వాత తెలిసింది’ అలాగే తన తల్లిదండ్రుల విడాకుల విషయంపై స్పందిస్తూ..  ‘నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నాను. వారి విడాకుల విషయం నన్ను అంతగా బాధపెట్టలేదు. ఎందుకంటే వారు నా కోసం ఎప్పుడు ఉంటారు. వారి విషయంలో నేను ఎప్పుడు ఒత్తిడికి గురి కాలేదు. ఇంకా నాకు 6 ఏళ్ల వయసులో క్షయ వ్యాధి వచ్చింది. అది కూడా నన్ను బాధించలేదు’ అని చెప్పింది. (చదవండి: ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన ఇరా ఖాన్‌)

అదే విధంగా తను లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొన్నట్లు ఈ సందర్భంగా ఇరా తెలిపింది. ‘నాకు 14 ఏళ్ల వయసులో ఉండగా లైంగిక వేధింపులకు గురయ్యాను. అప్పుడు ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు. అయితే ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి తెలిస్తే అది విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఆ పరిస్థితి నాకు ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యేది. ఈ క్రమంలో ఏడాది తర్వాత నాకు అర్థమైంది. వెంటనే నా తల్లిదండ్రులకు ఈ మెయిల్‌ ద్వారా విషయం చెప్పి దాని నుంచి బయటపడ్డాను. ఇక అది కూడా నాపై పెద్ద ప్రభావం చూపలేదు. దాని నుంచి నేను ముందుకు సాగాను, జీవితంలో కూడా నాకు చెడుగా అనిపించలేదు’ అని ఆమె వివరించింది. అయితే చివరకు తన మానసిక వేదన గల కారణాలపై స్పష్టత ఇవ్వకుండానే వీడియో ముగించి నెటిజన్‌లను, అభిమానులను ఇరా నిరాశపరిచింది. (చదవండి: ‘ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top