సహజత్వానికి చిరునామా సాయి పల్లవి | Interesting And Lesser Known Facts About Sai Pallavi In Telugu | Sakshi
Sakshi News home page

సహజత్వానికి చిరునామా సాయి పల్లవి

Jul 2 2025 8:13 AM | Updated on Jul 2 2025 12:17 PM

Interesting Facts About Sai Pallavi

మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి అన్నది నానుడి. అలా నటి అన్న తరువాత కాస్త గ్లామర్‌ అవసరం అన్నది సినిమా వాళ్ల మాట. అందుకే అందాలారబోతకు దూరంగా ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు అందుకు సిద్ధం అంటున్నారు. అయితే ఎలాంటి గ్లామర్‌ అవసరం లేకుండానే పాన్‌ ఇండియా స్టార్‌ అయిన కథానాయకి ఎవరైనా ఉన్నారంటే అది నటి సాయిపల్లవినే అవుతారు. డాక్టర్‌ అయ్యి యాక్టర్‌ అయిన అరుదైన తారలలో ఈమె ఒకరు. సాయిపల్లవి మంచి డాన్సర్‌. తద్వారా కలిగిన ఆసక్తినే సినిమా. తొలి రోజుల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన సాయిపల్లవి ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం ఏ ముహూర్తాన విడుదలై సంచలన విజయం సాధించిందో గానీ, ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లోనూ వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి.

అయితే తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్న సాయిపల్లవికి అక్కడ ప్లాప్‌ల సంఖ్చ చాలా తక్కువే. అదే విధంగా ప్లాప్‌ అయిన చిత్రాలలోనూ తన నటనకు మంచి మార్కులు పడటం అనేది అరుదైన విషయమే. అందుకు కారణం పాత్రల విషయంలో సాయిపల్లవి చూపే ప్రత్యేక శ్రద్దనే అని చెప్పవచ్చు. తనకు నచ్చిన బాటలో పయనిస్తున్న ఈమె అందంపై కాకుండా అభినయనానికి ప్రాముఖ్యనిస్తున్నారు. అలా సహజ నటిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఇప్పటి వరకూ గ్లామరస్‌ పాత్రల్లో నటించిందే లేదు.

అలా ఆమె సహజత్వానికి చిరునామాగా ముద్ర వేసుకున్నారు. ఇటీవల తమిళంలో అమరన్‌ చిత్రంలో నటించి అందరి అభినందనలను అందుకున్న సాయిపల్లవి, తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్‌ చిత్రంలోనూ నటనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్ని చిత్రాల్లో నటించామన్నది కాకుండా ఎన్ని మంచి చిత్రాల్లో నటించామన్నదే ముఖ్యం అని భావించే సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రామాయణం అనే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న భారతీయ ఇతిహాస గాథలో సీతగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె నటన ఎంతగా ఆకట్టుకుంటుందోన్న ఆసక్తి ఇప్పుడు సినీ ప్రేమికుల్లో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement