అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నా! | Ileana explains why she signed fewer films in Bollywood and South | Sakshi
Sakshi News home page

అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నా!

May 3 2021 12:17 AM | Updated on May 3 2021 3:32 AM

Ileana explains why she signed fewer films in Bollywood and South - Sakshi

‘‘ఎక్కువ సినిమాలు చేయాలనే తాపత్రయంలో ఏ కథ నా దగ్గరకు వస్తే ఆ కథకు ఓకే చెప్పాలనుకోవడంలేదు. కథాబలం ఉండి, నా పాత్ర సినిమాను ముందుకు నడిపించేలా ఉంటేనే ఒప్పుకుంటా’’ అంటున్నారు ఇలియానా. ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళ్లిన ఈ బ్యూటీ  ఆ తర్వాత హిందీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన మొదట్లో బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇలియానా చేతిలో ఏడాదికి ఒక సినిమా మించి ఉండటం లేదు.

ఈ విషయం గురించి ఇలియానా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పాత్రల ఎంపికలో నా విధానం పూర్తిగా మారిపోయింది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎన్ని మంచి సినిమాలు చేశామన్నదే ముఖ్యం. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను. డిఫరెంట్‌ రోల్స్‌ మాత్రమే చేయాలనుకుంటున్నాను. అందుకే నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలని ఉంది. అలాంటి కథ కోసం చూస్తున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఇలియానా నటించిన హిందీ చిత్రం ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ విడుదలకు సిద్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement