TNR పిల్లల బాధ్యతలు తీసుకుంటున్నా : 'ఐ డ్రీమ్‌' ఛైర్మన్‌

IDREAM Chairman Chinna Vasudeva Reddy Donates 10 Lakhs To TNR Family  - Sakshi

టీఎన్‌ఆర్‌ పిల్లలకు కూడా కరోనా పాజిటివ్‌

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కుటుంబానికి ఐడ్రీమ్‌ మీడియా అండగా నిలిచింది. స్వయంగా ఆ సంస్థ ఛైర్మన్‌ చిన్న వాసుదేవ రెడ్డి టీఎన్‌ఆర్‌ ఇంటికి వెళ్లి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. అంతేకాకుండా టీఎన్‌ఆర్‌ పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యతలు తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం టీఎన్‌ఆర్‌ పిల్లలతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులకు సైతం కరోనా సోకిందని, అదృష్టవశాత్తు వారిలో ఎవరికి సీరియస్‌గా లేదని చెప్పారు. అపోలో హాస్పిటల్స్‌ నుంచి ప్రముఖ వైద్యులు ఒకరు టీఎన్‌ఆర్‌ కుటుంబానికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా సుధీర్ఘ పోస్టును విడుదల చేశారు. 

'టీఎన్‌ఆర్‌ కేవలం ఐ డ్రీమ్‌ సంస్థకు ఉద్యోగి మాత్రమే కాదు. వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు, స్నేహితుడు. సంస్థ ఎదుగుదలకు ఎన్నో సూచనలు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండటం నా బాధ్యత. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, జ్యోతి గారికి కావాల్సిన నైతిక, ఆర్థిక మద్దతు అందజేసే విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు. వ్యక్తిగా TNR మనమధ్య లేకపోయినా ఆయన విడిచి వెళ్లిన జ్ఞాపకాలు, చేసిన కళాసేవ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి' అని ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేశారు.

ఇక టీఎన్‌ఆర్‌ ఇటీవలె కరోనా కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. 'ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌' అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్‌ఆర్‌కు ఇటీవలె కరోనా సోకింది. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 

చదవండి : TNR కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన డైరెక్టర్‌ మారుతి
TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్‌ బాబు ఆర్థిక సహాయం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top