హ్యాట్సాఫ్‌ టు సీయం జగన్‌ | I salute AP CM Jaganmohan Reddy for introducing online ticket booking | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్‌ టు సీయం జగన్‌

Sep 12 2021 5:19 AM | Updated on Sep 12 2021 5:19 AM

I salute AP CM Jaganmohan Reddy for introducing online ticket booking - Sakshi

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టిక్కెట్‌లను విక్రయించాలని ఆలోచించడం అభినందనీయం’’ అన్నారు హీరో విశాల్‌. ఆన్‌లైన్‌ బుకింగ్‌ సిస్టమ్‌ను అమలు చేయాలని ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి హ్యాట్సాఫ్‌ అని అన్నారు. అలాగే ఇది ఇండస్ట్రీలోని వారు ఆహ్వానించదగ్గ విషయమనీ, ఆన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ విధానంతో వంద శాతం పారదర్శకత సాధ్యమౌతుందని విశాల్‌ అభిప్రాయపడ్డారు. ఈ బుకింగ్‌ విధానాన్ని తమిళనాడులోనూ ప్రవేశపెట్టాలని తాను తమిళనాడు ముఖ్యమంత్రి యం.కె. స్టాలిన్‌ని కోరాలనుకుంటున్నానని పేర్కొన్నారు. తమిళనాడులో ఈ విధానం అమలయితే చాలా సంతోషిస్తాననీ అన్నారు విశాల్‌. దీనివల్ల థియేటర్స్‌ వసూళ్లు పూర్తి పారదర్శకంగా ఉంటాయని, ఇది ఇండస్ట్రీతో పాటు ప్రభుత్వానికి కూడా వరం అని విశాల్‌ సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement