Hero Vishwak Sen Tested Positive for Covid-19 - Sakshi
Sakshi News home page

Vishwak Sen: వ్యాక్సిన్‌ వేయించుకున్నా కరోనా బారిన పడ్డ విశ్వక్‌ సేన్‌

Dec 31 2021 4:20 PM | Updated on Dec 31 2021 4:54 PM

Hero Vishwak Sen Tested Positive for Covid19 - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం నాడు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుడి సలహా మేరకు అన్ని నిబంధనలను పాటిస్తూ ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నాను. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ ఈ వైరస్‌ కార్చిచ్చులా వ్యాపిస్తుండటం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్కు ధరించండి, జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

ఈ ట్వీట్‌పై ఆయన అభిమానులు స్పందిస్తూ.. ఇది ఒమిక్రాన్‌ అయితే కాదు కదా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మధ్యే 'పాగల్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం 'ఓ మై కడవులే' తెలుగు రీమేక్‌ 'ఓరి దేవుడా', 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement