మిషన్‌ 2020

Hero Srikanth Released Mission 2020 Movie First Look Poster  - Sakshi

నవీన్‌చంద్ర హీరోగా నటించిన చిత్రం ‘మిషన్‌ 2020’. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమిది. శ్రీమిత్ర అండ్‌ మైవిలేజ్‌ సమర్పణలో బన్నీ క్రియేషన్స్, మధు మృధు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించాయి. కుంట్లూరు వెంకటేశ్‌ గౌడ్, కేవీఎస్‌ఎస్‌ఎల్‌. రమేష్‌రాజు నిర్మాతలు. కరణం బాబ్జి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘మెంటల్‌ పోలీస్‌’, ‘ఆపరేషన్‌ 2019’ సినిమాలకు కరణం బాబ్జి దర్శకత్వం వహించి, ఆ చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ ‘మిషన్‌–2020’ కథ చాలా బావుంది. ఈ ఏడాది 2020 సినిమా పరిశ్రమకు పెద్ద సంక్షోభం, ‘మిషన్‌ 2020’ సినిమా ఈ సంక్షోభాన్ని అధిగమిస్తుందని భావిస్తున్నా’’ అన్నారు. కరణం బాబ్జి మాట్లాడుతూ– ‘‘నాకు హీరో శ్రీకాంత్‌గారు సెంటిమెంట్‌. నవీన్‌చంద్ర, నాగబాబు, జయప్రకాశ్‌ రెడ్డిగారు అంకితభావంతో నటించారు. శ్రీరాపాక గారు రాసిన ఐటమ్‌ సాంగ్‌తో శనివారం సినిమా షూటింగ్‌ పూర్తయింది. 2020లో ఈ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలతో పాటు, సంగీత దర్శకుడు ర్యాప్‌రాక్‌ షకీల్, జర్నలిస్ట్‌ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top