‘కార్తికేయ 2’ ట్రైలర్‌ ఈవెంట్‌, వేదికపైనే ఫ్యాన్‌కి నిఖిల్‌ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ | Hero Nikhil Surprising Gift to Fan At Karthikeya 2 Trailer Event Video Goes Viral | Sakshi
Sakshi News home page

Nikhil: కార్తికేయ 2 ట్రైలర్‌ ఈవెంట్‌, వేదికపైనే ఫ్యాన్‌కి నిఖిల్‌ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌

Jun 25 2022 3:04 PM | Updated on Jun 25 2022 3:08 PM

Hero Nikhil Surprising Gift to Fan At Karthikeya 2 Trailer Event Video Goes Viral - Sakshi

యంగ్‌​ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఇది. నిన్న(జూన్‌ 24) ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈమూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌తో పాటు హీరోయిన్‌, డైరెక్టర్‌ ఇతర నటీనటులు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు వచ్చిన వీరాభిమానికి నిఖిల్‌ అక్కడిక్కడే సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్‌ పెళ్లి?, ఫొటో వైరల్‌

సదరు అభిమాని ఈవెంట్‌లో లేచి మాట్లాడుతూ.. నిఖిల్‌ కెరీర్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన నటించిన ప్రతి సినిమా చూస్తున్నానని చెప్పాడు. ఆయనంటే తనకెంతో ఇష్టమంటూ నిఖిల్‌పై అభిమానం కురిపించాడు. ఇక అతడి అభిమానానికి ఫిదా అయిన నిఖిల్‌ అతడి వేదిక మీదకు పిలిచాడు. అనంతరం తన గుర్తుగా అక్కడికక్కడే తన ఫ్యాన్‌కు తను పెట్టుకున్న కూలిగ్‌గ్లాసెస్‌ బహుమతిగా ఇచ్చాడు. ఈవెంట్‌ అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సదరు ఫ్యాన్‌ మహేశ్‌ దాసరి ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన

అతడి ట్వీట్‌పై నిఖిల్‌ స్పందిస్తూ.. ‘బ్రో.. ఆ గ్లాసెస్‌ను జాగ్రత్త చూసుకోండి. నాపై మీరు చూపించిన ప్రేమకు గుర్తుగా వెంటనే నేను ఇచ్చిన గిఫ్ట్‌ అది’ అని రాసుకొచ్చాడు. కాగా సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం.. ద్వారకా నగరం అనే ఆసక్తికర కథాంశంతో ఈ కార్తికేయ 2 తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్‌గా వైవా హర్ష కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement