మీతో సెల్ఫీలు దిగడానికే వచ్చానా?: హీరోయిన్‌ సీరియస్‌ | Hema Malini Refuses To Pose At Event, Says 'We Are Not Here to Take Selfies' - Sakshi
Sakshi News home page

Hema Malini: సెల్ఫీలు దిగడానికి రాలేదిక్కడికి... గరమైన స్టార్‌ హీరోయిన్‌

Published Wed, Jan 10 2024 7:36 PM | Last Updated on Wed, Jan 10 2024 9:27 PM

 Hema Malini refuses to Pose at Event, says We Are Not Here to Take Selfies - Sakshi

తారలు కనిపిస్తే చాలు ఫోటోలు, సెల్ఫీలంటూ వెంటపడుతుంటారు జనాలు. కెమెరామన్లయితే వారిని తమ కెమెరాల్లో బంధించాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు మేకప్‌తో ఉన్నా, లేకపోయినా.. ఏదైనా హడావుడిలో ఉన్నా, తాపీగా ఉన్నా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ కెమెరాలు క్లిక్‌మనిపిస్తూనే ఉంటారు. అందరు సెలబ్రిటీలు సహనంగా ఫోటోలకు, సెల్ఫీలకు రెడీగా ఉండరు. కొందరు చిరాకుతో వారిని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు కూడా! తాజాగా సీనియర్‌ హీరోయిన్‌ హేమమాలిని కూడా ఇదే చేసింది.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్‌
ప్రముఖ గేయ రచయిత గుల్జర్‌ బయోగ్రఫీ 'గుల్జార్‌ సాబ్‌: హజార్‌ రహే మడ్‌ కే దేఖిన్‌' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హేమమాలిని హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో గుంభనంగా కనిపించింది నటి. ఓ అభిమాని సెల్ఫీ ఇవ్వమని అడగ్గా నీకు సెల్ఫీలు ఇవ్వడానికి రాలేదిక్కడికి అని ఆగ్రహంగా బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'సెల్ఫీ అడిగినందుకు ఇంత పొగరెందుకో..', 'జయా బచ్చన్‌లాగే ఈమెకు కూడా జనాలు కనబడితే నచ్చదేమో..' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈమధ్యే బర్త్‌డే పార్టీ
కాగా హేమమాలిని ఇటీవలే 75వ పడిలోకి అడుగుపెట్టింది. తనతో పాటు హీరోహీరోయిన్లుగా రాణించిన అందరినీ బర్త్‌డే వేడుకలకు పిలిచి పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి జితేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ, పద్మిని కొల్హాపూర్‌ తదితరులు మెరిశారు. అలాగే డిసెంబర్‌లో జరిగిన ధర్మేంద్ర 88వ బర్త్‌డే ఫంక్షన్‌లోనూ హేమమాలిని స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. సోషల్‌ మీడియాలోనూ 'ప్రియమైన జీవిత భాగస్వామి... నువ్వు నాకెంతో స్పెషల్‌..' అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. కాగా హేమమాలిని చివరగా 2020లో వచ్చిన 'సిమ్లా మిర్చి' మూవీలో కనిపించింది.

చదవండి: అందుకే నా కోడలు మాజీ ప్రియుడిని కలవరిస్తోంది: నటి అత్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement