Happy Mother's Day 2023: List of Heroines Who Became a Mother Before Marriage - Sakshi
Sakshi News home page

Happy Mothers Day 2023: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్‌ వీళ్లే

Published Sun, May 14 2023 9:25 AM

HAppy mothers day 2023: List Of Heroines Who Became A Mother Before Marriage - Sakshi

అమ్మ.. ఆ పిలుపు కోసం తపించని వారుంటారా? ఆ స్పర్శ కోరుకోని వారుంటారా? అమ్మ అంటే వేయి ఏనుగుల బలం. అమ్మ అంటే కదిలొచ్చే దేవత. అమ్మ అంటే మమతల కోవెల. ఎంత వర్ణించినా అమ్మ గొప్పతనాన్ని మాటల్లో బందీ చేయలేము. అమ్మ కోసం ఆరాటపడేవారు కొందరైతే అమ్మగా మారాలని తపించేవాళ్లు కొందరు! పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాకే మాతృత్వపు మమకార మాధుర్యం చూడాలని కోరుకోవడం లేదు కొందరు. అలాంటివారి జాబితాలో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు.

ప్రేమించినవాడితో పెళ్లి వాయిదా వేశారే కానీ సంతానాన్ని వద్దనుకోలేదు. ఫలితంగా పెళ్లి కాకముందే గర్భం దాల్చినవాళ్లు ఉన్నారు. ఏడడుగులు వేయడానికి ముందే బుడిబుడి అడుగులు వేసే పాపాయితో పందిట్లోకి అడుగుపెట్టినవాళ్లు ఉన్నారు. మదర్స్‌ డే సందర్భంగా ఓసారి ఆ తల్లులను గుర్తు చేసుకుందాం..

నీనా గుప్తా
నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే వెస్ట్‌ ఇండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో బిడ్డను కన్నది. అయితే అతడు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో నీనా సింగిల్‌ పేరెంట్‌గా మసాబా గుప్తాను పెంచింది.

కల్కి కొచ్లిన్‌
బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్‌.. డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌తో మూడేళ్లు ప్రేమాయణం సాగించి 2011లో పెళ్లి చేసుకుంది. కానీ వీరి వైవాహిక బంధం సజావుగా సాగలేదు.  2013లో విడిపోగా 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హర్ష్‌బెర్గ్‌తో డేటింగ్‌ చేయగా వీరికి కూతురు పుట్టింది. ఇప్పటికీ వీరు పెళ్లి చేసుకోలేదు.

రేణు దేశాయ్‌..  
బద్రి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్‌. ఆ సినిమా సమయంలోనే  పవన్‌ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. అతడితో ఏడుగులు వేయడానికే ముందే అకీరా జన్మించాడు. అతడికి ఐదేళ్ల వయసొచ్చాక పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్లు కలిసి మెలిసి ఉన్నా తర్వాత విడిపోయారు.

సెలీనా జైట్లీ
నటి సెలీనా జైట్లీ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త పీటర్‌ హగ్‌తో సహజీవనం చేసిన ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చింది.  దీంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.

సారిక
స్టార్‌ హీరోయిన్‌గా కొన్నాళ్లు చక్రం తిప్పిన సారిక స్టార్‌ నటుడు కమల్‌ హాసన్‌తో ప్రేమాయణం నడిపింది. కొంతకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి శృతి హాసన్‌ జన్మించింది. తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

గాబ్రియెల్లా
మోడల్‌, నటి గాబ్రియెల్లా డెమట్రేడ్స్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌తో డేటింగ్‌లో ఉంది.  త్వరలో ఆమె రెండోసారి తల్లి కాబోతోంది. కానీ ఇప్పటివరకు వీరు పెళ్లి చేసుకోలేదు.

మహిహ చౌదరి
నటి మహిమ చౌదరి పెళ్లి చేసుకునే సమయానికి ఐదు నెలల గర్భవతి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2006 మార్చిలో ఆమె బాబీ ముఖర్జీని పెళ్లాడింది.

అమృత అరోరా
అమృత అరోరా.. షేకలా లడక్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే గర్భం దాల్చింది.  బిడ్డ పుట్టాక ప్రియుడిని పెళ్లాడింది.

శ్రీదేవి
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది.  జాన్వీ కపూర్‌ కడుపులోకి వచ్చాకే ఆమె బోనీకపూర్‌ను పెళ్లాడింది. అప్పటికి ఆమె ఏడు నెలల గర్భిణి.

కొంకణ్‌ సేన్‌ శర్మ
నటుడు రణ్‌వీర్‌ షోరేతో ఎంతోకాలం రిలేషన్‌షిప్‌ కొనసాగించిన ఈ నటి ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే తను గర్భవతి. పెళ్లైన తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు.

అమీ జాక్సన్‌
ఐ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ అమీ జాక్సన్‌. ప్రియుడు జార్జ్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగిన మరుక్షణమే తను ప్రెగ్నెంట్‌ అన్న విషయాన్ని వెల్లడించింది. తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆ ప్రేమ పెళ్లి దాకా రాకుండానే ఆగిపోయింది.

నేహా ధూపియా
బాలీవుడ్‌ నటి నేహా ధూపియా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ విషయాన్ని నేహా ధూపియా ఆమె ప్రియుడు అంగద్‌ బేడీ ఇంట్లో చెప్పి ఒప్పించాకే పెళ్లి చేసుకున్నారు. నేహాతో అంగద్‌ షాదీ జరిగే సమయానికి ఆమె మూడు నెలల గర్భిణి.

దియా మీర్జా
బాలీవుడ్‌ నటి దియా మీర్జా వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీని పెళ్లాడింది. అతడిని పెళ్లాడే సమయానికే ఆమె గర్భం దాల్చింది. నటి నటాషా స్టాంకోవిచ్‌ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే గర్భం దాల్చింది. క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యాతో కొంతకాలం పాటు రిలేషన్‌లో ఉన్న ఆమె ప్రెగ్నెన్సీ వచ్చాక పెళ్లి చేసుకుంది.

అలియా భట్‌
అలియా భట్‌ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయిందంటారు. 2022 ఏప్రిల్‌ 14న రణ్‌బీర్‌ కపూర్‌ను పెళ్లాడింది. జూన్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌లో రాహాకు జన్మనిచ్చింది ఆలియా.

చదవండి:
మదర్స్‌ డే స్పెషల్‌...కమ్మనైన ఈ అమ్మ పాటలు విన్నారా?

మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన చిత్రాలివే

 
Advertisement
 
Advertisement