హనుమాన్ సూపర్‌ హిట్‌.. డైరెక్టర్‌కు కళ్లు చెదిరే గిఫ్ట్! | Sakshi
Sakshi News home page

Prasanth Varma: హనుమాన్ సూపర్‌ హిట్‌.. ప్రశాంత్ వర్మకు కోట్ల విలువైన బహుమతి!

Published Wed, Jan 31 2024 6:19 PM

Hanuman Director Prashanth Varma Gets Big Surprise Gift From Producer - Sakshi

హనుమాన్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా రిలీజైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా వచ్చి దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ప్రశాంత్ వర్మ మరో సినిమా తీసేందుకు రెడీ ‍అయ్యారు. జై హనుమాన్ పేరుతో సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ మూవీ ఘన విజయం సాధించండంతో హనుమాన్ నిర్మాత నిరంజన్‌ రెడ్డి బిగ్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మకు ఖరీదైన గిఫ్ట్‌ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. అంతే కాదు దాదాపు రూ.6 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇవ్వనున్నారట. ఇప్పటికే కారును కూడా బుక్‌ చేసినట్లు సమాచారం. 

సాధారణంగా సినిమాలు సూపర్‌ హిట్‌ అయితే ఖరీదైన కార్లు బహుమతిగా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. గతంలోనూ పలువురు నిర్మాతలు డైరెక్టర్లకు కార్లు బహుమతులుగా అందించారు. బేబీ డైరెక్టర్‌కు ఇలాగే నిర్మాత కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతే కాకుండా విశాల్ మార్క్ ఆంటోనీ డైరెక్టర్‌ అధిక్ రవిచంద్రన్‌కు కారు బహుమతిగా ఇచ్చి నిర్మాత సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.  రజినీకాంత్, నెల్సన్‌కు కాస్ట్ లీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హనుమాన్‌తో సూపర్‌ హిట్‌ కొట్టిన ప్రశాంత్‌ వర్మకు సైతం ఖరీదైన కారు ఇవ్వనుండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement