సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే? | Guntur Kaaram, Hanuman And Other Sankranti Released Movies OTT Release Dates And Streaming Platforms - Sakshi
Sakshi News home page

Sankranti Released Movies OTT Release: సంక్రాంతికి థియేటర్లలో... మరి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అప్పుడేనా?

Published Wed, Jan 31 2024 12:04 PM

Guuntur Kaaram And Hanuman OTT Release Date And Details - Sakshi

సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'హనుమాన్' తప్పితే మిగతావన్నీ సైలెంట్ అయిపోయాయి. ఈ శుక్రవారం దాదాపు 8-10 వరకు తెలుగు చిన్న మూవీస్ అన‍్నీ ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. అలానే రాబోయే రెండు మూడు నెలల్లో పెద్ద చిత్రాలేం లేవు. దీంతో మూవీ లవర్స్ దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. కొత్తగా ఏమున్నాయి? సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లోకి ఎప్పుడొస్తాయని తెగ సెర్చ్ చేస్తున్నారు.

'గుంటూరు కారం' విషయానికొస్తే.. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమాకు రిలీజ్‌కి ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్, రొట్టకొట్టుడు కంటెంట్ వల్ల ప్రేక్షకులు మరీ అంత కాకపోయినా సరే లైట్ తీసుకున్నారు. మహేశ్ యాక్టింగ్ తప్పితే ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏం లేదని చెప్పొచ్చు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగు వారాల అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

'హనుమాన్' విషయానికొస్తే.. మహేశ్ మూవీతో పాటు జనవరి 12న రిలీజైన ఈ చిత్రంపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల సమస్య వల్ల తొలివారం పర్లేదు గానీ ఆ తర్వాత కలెక్షన్స్ దుమ్మురేపాయి. ఇప్పటికే రూ.250 కోట్ల వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. లెక్క ప్రకారం థియేటర్లలోకి వచ్చిన మూడు-నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేలా డీల్ మాట్లాడుకున్నారు. కానీ టాక్-రెస్పాన్స్ చూసి ప్లాన్ మారింది. మార్చి 2 లేదా 3వ వారం ఓటటీలోకి రావొచ్చని టాక్.

జనవరి 13న థియేటర్లలో విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్'.. ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. కంటెంట్‪‌, స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకుల్ని ఇది అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటింంచేశారు. నాగార్జున 'నా సామి రంగ' పెద్దగా అంచనాల్లేకుండా సంక్రాంతి బరిలో దిగి పాసైపోయింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇవన్నీ రూమర్ డేట్స్ అయినప్పటికీ త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?)

Advertisement
Advertisement