సత్యదేవ్, తమన్నా.. ‘గుర్తుందా.. శీతాకాలం’.. కొత్త తేదీ ఖరారు

Gurthunda Seethakalam Movie Change Its Release Plans Tollywood - Sakshi

సత్యదేవ్, తమన్నా జంటగా మేఘా ఆకాష్, కావ్యా శెట్టి, ప్రియదర్శి ముఖ్య తారలుగా నాగశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుర్తుందా...శీతాకాలం’. ఎమ్‌ఎస్‌ రెడ్డి, చినబాబు సమర్పణలో భావనా రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా సెప్టెంబర్‌ 9న విడుదల కావాల్సింది. అయితే తాజాగా కొత్త తేదీని ఖరారు చేశారు. ఈ సినిమాను సెప్టెంబరు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ మంగళవారం ప్రకటించింది.

‘‘ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లోని టీనేజ్, కాలేజ్‌ లైఫ్‌ సంఘటనలను అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ విషయాలనే ఈ సినిమాలో చూపించాం. కన్నడ హిట్‌ ఫిల్మ్‌ ‘లవ్‌ మాక్‌టైల్‌’కు తెలుగు రీమేక్‌గా  ‘గుర్తుందా.. శీతాకాలం’ రూపొందింది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్‌  ప్రొడ్యూసర్‌: నవీన్‌ రెడ్డి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top