అలాంటి సీన్స్ ఉంటే చేస్తా.. కానీ: గుంటూరు కారం భామ | Guntur Kaaram Heroine Meenakshi Chaudhary | Sakshi
Sakshi News home page

Meenakshi Chaudhary: అలా అయితేనే ఆ సీన్స్ చేస్తా: మీనాక్షి చౌదరి

Published Sun, Jan 28 2024 6:58 PM | Last Updated on Sun, Jan 28 2024 7:44 PM

Guntur Kaaram Heroine Meenakshi Chaudhary - Sakshi

ఇటీవలే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో తనదైన నటనతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. అయితే తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది ముద్దుగుమ్మ. అవకాశం వస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి  తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయని వెల్లడించింది.

(ఇది చదవండి: ఓటీటీలో యానిమల్‌.. నెట్‌ఫ్లిక్స్‌పై నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే?)

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..' మహేశ్‌ బాబుతో ఛాన్స్​ అనగానే నా సంతోషానికి అవధులు లేవు. తొలి రోజే సెట్‌లో ఆయనతోనే నటించా. మొదట కంగారు పడ్డా. కానీ టెన్షన్‌ పడకుండా ఇంకాస్తా సమయం తీసుకోమని మహేశ్‌ నాకు ధైర్యం చెప్పారు. కానీ సినిమాల్లో నా కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నా. తెరపై ముద్దు సీన్స్‌కు సంబంధించి కొన్ని రూల్స్ కచ్చితంగా పాటిస్తా. స్క్రిప్ట్‌ డిమాండ్‌ను చేస్తే తప్ప అలాంటి వాటికి ఒప్పుకోను. అది కూడా మరీ అసభ్యకరంగా లేకుంటేనే చేస్తా. కేవలం కిస్​ సీన్స్​ కోసమే అంటే కచ్చితంగా నో చెప్పేస్తా.' అంటూ తన మనసులోని మాటలను పంచుకుంది. 

అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నా పట్ల  ఎంతో ఆప్యాయతను చూపిస్తున్నారని తెలిపింది. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలు చేయాలనేదే తన కోరికని వెల్లడించింది. అందువల్లే కథల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. రెమ్యునరేషన్ కంటే.. నటనకే ప్రాధాన్యత ఇస్తానని అంటోంది మీనాక్షి చౌదరి. కాగా.. తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంలో పరిచయమైంది. ఆ తర్వాత రవితేజ సరసన 'ఖిలాడి', అడివి శేష్‌తో కలిసి 'హిట్‌ 2' సినిమాలతో హిట్స్ సాధించింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement