breaking news
Kiss Scenes
-
పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసిన విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ నెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి ప్రేమాయణంపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ.. ఇద్దరూ స్పందించలేదు. తాము రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ పరోక్షంగా హింట్ ఇస్తూనే వచ్చారు. చివరకు ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సడెన్‌గా పెళ్లి డేట్‌ని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. రేపు ఉదయం ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌లో వీరిద్దరు ఏడు అడుగులు వేయబోతున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.ఇదిలా ఉంటే..పెళ్లివేళ రష్మికకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక గతంలో 'గీత గోవిందం' సినిమాలోని తన తొలి ముద్దు సీన్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘తొలిసారి ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సీన్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అది చాలా వ్యక్తిగతమైన విషయం. సెట్లో 200 మంది చూస్తుండగా ఎలా చేయాలో అర్థం కాలేదు. అయితే, నా కో-యాక్టర్ విజయ్‌ది కూడా అదే పరిస్థితి. నాలాగే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. చివరకు అది ఒక టెక్నికల్ విషయంలా పూర్తి చేశాం. పాత్రకు అవసరమైతే అలాంటి సీన్ చేయాల్సిందే’ అని చెప్పుకొచ్చింది. కాబోయే భర్తతోనే తొలి ముద్దు సీన్ చేయడం గమనార్హం. కాగా, రష్మిక, విజయ్ గీత గోవిందంతో పాటు డియర్ కామ్రేడ్ అనే సినిమాలోనూ కలిసి నటించారు. -
అలాంటి సీన్స్ ఉంటే చేస్తా.. కానీ: గుంటూరు కారం భామ
ఇటీవలే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో తనదైన నటనతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. అయితే తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది ముద్దుగుమ్మ. అవకాశం వస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయని వెల్లడించింది. (ఇది చదవండి: ఓటీటీలో యానిమల్.. నెట్‌ఫ్లిక్స్‌పై నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే?) మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..' మహేశ్ బాబుతో ఛాన్స్ అనగానే నా సంతోషానికి అవధులు లేవు. తొలి రోజే సెట్లో ఆయనతోనే నటించా. మొదట కంగారు పడ్డా. కానీ టెన్షన్ పడకుండా ఇంకాస్తా సమయం తీసుకోమని మహేశ్ నాకు ధైర్యం చెప్పారు. కానీ సినిమాల్లో నా కోసం కొన్ని నియమాలు పెట్టుకున్నా. తెరపై ముద్దు సీన్స్‌కు సంబంధించి కొన్ని రూల్స్ కచ్చితంగా పాటిస్తా. స్క్రిప్ట్ డిమాండ్‌ను చేస్తే తప్ప అలాంటి వాటికి ఒప్పుకోను. అది కూడా మరీ అసభ్యకరంగా లేకుంటేనే చేస్తా. కేవలం కిస్ సీన్స్ కోసమే అంటే కచ్చితంగా నో చెప్పేస్తా.' అంటూ తన మనసులోని మాటలను పంచుకుంది. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నా పట్ల ఎంతో ఆప్యాయతను చూపిస్తున్నారని తెలిపింది. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలు చేయాలనేదే తన కోరికని వెల్లడించింది. అందువల్లే కథల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. రెమ్యునరేషన్ కంటే.. నటనకే ప్రాధాన్యత ఇస్తానని అంటోంది మీనాక్షి చౌదరి. కాగా.. తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంలో పరిచయమైంది. ఆ తర్వాత రవితేజ సరసన 'ఖిలాడి', అడివి శేష్‌తో కలిసి 'హిట్ 2' సినిమాలతో హిట్స్ సాధించింది. -
ఇంటిమేట్ సీన్స్‌లో నటించేటప్పుడు క్యారవాన్‌లో కూర్చొని ఏడ్చాను : హీరోయిన్
తెలుగుమ్మాయి అయినప్పటికీ తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అంజలి ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్స్లో వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో కీలక పాత్రలో నటిస్తుంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి ముద్దుసీన్లు, ఇంటిమేట్ సీన్లలో నటించడం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. 'కొన్నిసార్లు పాత్రకు తగ్గట్లు ముద్దుసీన్లలో నటించాల్సి వస్తుంది. మనకు ఇష్టం లేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఇబ్బందే. ఇక కొన్నిసార్లు ఇంటిమేట్ సీన్లలో నటించినప్పుడు క్యారవాన్‌లోకి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయినా సీన్ పండటం కోసం నటించాల్సి వస్తుంది' అంటూ ఎమోషనల్ అయ్యింది. -
‘అందుకే నా సినిమాలో అలాంటి సీన్లు ఉండవు’
ఓ సినిమా విజయం సాధించాలంటే కథతో సంబంధం లేకుండా బోలేడన్ని ముద్దు సన్నివేశాలు.. మితిమీరిన అశ్లీలత ఉంటే చాలనుకునే రోజులివి. ప్రస్తుతం ఈ దరిద్రం అన్ని ఇండస్ట్రీల్లోనూ కనిపిస్తుంది. కానీ తాను మాత్రం ముద్దు, అసభ్యకర సన్నివేశాలుండే చిత్రాలను అసలు ఒప్పుకోనంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్. ఈ విషయం గురించి ఆయన స్పందిస్తూ.. ‘ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని నేను కథలను ఎంచుకుంటాను. ఎందుకంటే నేను కూడా నా కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు చూస్తాను. అలానే ప్రేక్షకులు కూడా కుటుంబంతో కలిసి సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను. అలాంటిది ఫ్యామిలితో.. ముఖ్యంగా పిల్లలతో సినిమా చూడ్డానికి వచ్చినప్పుడు స్క్రీన్ మీద ముద్దు, అశ్లీల దృశ్యాలు వస్తే ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. అందుకే నేను ఇలాంటి సన్నివేశాలు డిమాండ్ చేసే సినిమాలు ఒప్పుకోను’ అని తెలిపారు అజయ్. అయితే శివాయ్ సినిమాలో మాత్రం అజయ్ ఈ రూల్‌ని బ్రేక్ చేశారు అజయ్. దీని గురించి ఆయన వివరణ ఇస్తూ.. ‘ ఆ సినిమాలో లవ్ సీన్ కోసం అలా చేయాల్సి వచ్చింది. అయితే అది బలవంతంగా సినిమాలో ఇరికించిన సీన్ కాదు. కానీ నేటి సినిమాల్లో ఇలాంటి సీన్లు కావాలనే పెడుతున్నారు. కథ బలంగా ఉంటే ఇవేవి అక్కర్లేద’ని తెలిపారు అజయ్. ప్రస్తుతం ‘దే దే ప్యార్‌దే’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు అజయ్. అక్వి అలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, టబు అజయ్‌కు జంటగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 17 విడుదల కానుంది. -
ముద్దు సీన్లు ఉంటే చాలు బాలీవుడ్లో భారీ ఓపెనింగ్స్!
ముద్దు సీన్లే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తాయని బాలీవుడ్ దర్శకుడు కర ణ్ జోహార్ కొత్త బాష్యం చెప్పారు. తెరపై ముద్దు సీన్లు ఉంటే బాక్సాఫీస్ ఓపెనింగ్స్ బ్రహ్మండంగా ఉంటాయని కరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ముద్దు సీన్ల ఫార్ములా కరణ్ కలిసి వచ్చిందేమో ఏమో కాని మళ్లీ హైవే హీరోయిన్ ఆలియా భట్‌తో ’2 స్టేట్స్’ అనే చిత్రంలో మరోసారి ఆ ప్రయోగానికి తెర లేపారు. 2012లో కరణ్ జోహార్ నిర్మించిన ’స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంలో ఆలియా, సిద్దార్థ్ మల్హోత్రా ముద్దు సీన్‌కు ప్రేక్షకుల నుంచి బాగానే రెస్పాన్స్ వచ్చింది. అదే జోష్‌తో తన తాజా చిత్రం ‘2 స్టేట్స్’లో ఆలియా, అర్జున్ కపూర్లతో కరణ్ ముద్దు సీన్ చిత్రీకరించారట! ఆలియా, దర్శకుడు అభిషేక్ వర్మన్ల మధ్య అఫైర్ నడుస్తోందని వచ్చిన వార్తలు కరణ్ దృష్టికి తీసుకురాగా.. ఆలియా, అర్జున్ కపూర్ల మధ్య ఏదో నడుస్తోందని అనుకుంటుంటే..తనకు తెలియని న్యూస్ అందించారనిఇటీవల విడుదల చేసిన ’2 స్టేట్స్’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కరణ్ సరదాగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


