సీనియర్ నటుడి కుమారుడు హీరోగా కొత్త చిత్రం! | Sakshi
Sakshi News home page

Pranam Devaraj: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా యంగ్ హీరో చిత్రం!

Published Wed, Jan 3 2024 6:35 PM

Grand Opening Ceremony Of Pranam Devaraj In Shankar Direction - Sakshi

ప్రణం దేవరాజ్, సుమన్, రవి శివతేజ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో  పి.హరికృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్‌పై మొదటి చిత్రంగా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా.. దేవరాజ్ కెమరా స్విఛ్‌ ఆన్ చేశారు. 

తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. 'సినిమా అంటే చాలా ప్యాషన్ ఉండాలి. హరి క్రియేషన్స్ బ్యానర్‌ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. దేవరాజు ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని వాళ్ల అబ్బాయి ప్రణం దేవరాజ్ ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. శంకర్ చాలా ప్రతిభ గల దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి' అని కోరారు.

దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్‌కు ధన్యవాదాలు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.  మొదటి షెడ్యూల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, ఆ తర్వాత వైజాగ్ పరిసర తెరకెక్కించనున్నాం' అని తెలిపారు. హీరో ప్రణం మాట్లాడుతూ.. 'ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. మంచి లవ్ స్టొరీ, యాక్షన్ సినిమా. మీ అందరి ప్రోత్సాహం కావాలి' అని కోరారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement