భర్తను ఎత్తుకున్న నటి.. ఫోటో వైరల్‌

Gauahar Khan Lifts Hubby Zaid Darbar in Her Arms - Sakshi

బాలీవుడ్‌ నటి, హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గౌహర్‌ ఖాన్‌, కొరియెగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 25న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిఖా జరిగింది. ఇక వివాహం అయిన నాటి నుంచి పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. అభిమానులను ఖుషి చేస్తున్నారు గౌహర్‌ జంట. ఇక తాజాగా నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ‘ఇంతవరకు ఇలాంటి ఫీట్‌ ఎవ్వరు చేయలేదు మేడం.. మీరు సూపర్బ్’‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇంతకు ఆ ఫీట్‌ ఏంటో తెలియాలంటే ఇది చదవండి. సాధారణంగా సినిమాల్లో, రియల్‌గా కూడా అబ్బాయి.. అమ్మాయిని చేతలతో ఎత్తుకుంటాడు. ఫోటోలకు ఫోజులు ఇస్తాడు. (చదవండి: ‘మా లవ్‌స్టోరీని గుండెలపై లిఖించుకుంటున్నాం)

ఇక సినిమాలో అప్పుడప్పుడు హీరోయిన్‌, హీరోను ఎత్తుకునే సన్నివేశాలు వచ్చినా.. అవి గ్రాఫిక్స్‌ తప్ప రియల్‌ కాదనే విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌహర్‌ ఓ సాహసోపేతమైన ఫీట్‌ చేశారు. భర్తను చేతుల్లోకి ఎత్తుకుని ఫోటోలకు ఫోజిచ్చారు. పోస్ట్‌ వెడ్డింగ్‌ ఫోటో షూట్‌లో భాగంగా గౌహర్‌ తన భర్త జైద్‌ను ఎత్తుకున్నారు. మంచి-చెడు, బలం-బలహీనం అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఇక ప్రస్తుతం గౌహర్‌, తాండవ్‌ సినిమాతో బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top