గ్యాంగ్ స్టర్ గంగరాజు: ‘ఏమో ఇలాగా’ అనే పాట విడుదల..!! | Gangster Gangaraju Movie Emo Elaaga Song Released | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ స్టర్ గంగరాజు: ‘ఏమో ఇలాగా’ అనే పాట విడుదల..!!

Sep 9 2021 11:10 PM | Updated on Sep 9 2021 11:10 PM

Gangster Gangaraju Movie Emo Elaaga Song Released - Sakshi

వరుస విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ. 'వలయం' వంటి సస్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో ప్రస్తుతం మరో వైవిధ్యభరితమైన సినిమా చేస్తున్నాడు. `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు` అనే వెరైటీ సినిమాతో మరొకసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్లుక్ విడుదల కాగా ప్రేక్షకులను ఈ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ లుక్ ఎంతో డిఫరెంట్‌గా ఉండడంతో పాటు ఆసక్తికరంగా ఉందని ప్రేక్షకులు తెలియజేశారు.  మంచి అభిరుచి గల దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్  సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమాకి సంభందించిన తొలి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 'ఏమో ఇలాగా' అంటూ మొదలయిన ఈ పాట ను హేమచంద్ర ఆలపించగా, భాస్కర భట్ల రచించారు. అనీష్ మాస్టర్ కోరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ కాగా ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదల అయ్యింది. ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ హీరోగా నటించిన వలయం సినిమాలోని నిన్ను చూశాకే అనే పాట 12 మిలియన్స్ కు చేరుకోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement