The Flash Actor Ezra Miller Arrested in Harassment, Misconduct Charges - Sakshi
Sakshi News home page

Ezra Miller : బార్‌లో తాగి రెచ్చిపోయిన హీరో.. సింగర్‌పై లైంగిక దాడి

Mar 29 2022 5:45 PM | Updated on Mar 29 2022 7:00 PM

The Flash Actor Ezra Miller Arrested On Harassment, Misconduct Charges - Sakshi

The Flash Actor Ezra Miller Arrested On Harassment, Misconduct Charges: జస్టిస్ లీగ్, ది ఫ్లాష్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ వంటి సినిమాలతో పాపులర్‌ అయిన హాలీవుడ్‌  యంగ్‌ హీరో ఎజ్రా మిల్లర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల ప్రకారం.. అమెరికా హవాయిలోని ఓ బార్‌లో జరిగిన పార్టీలో మిల్లర్‌ పాల్గొన్నాడు. అక్కడ 23 ఏళ్ల  ఓ యువతి సాంగ్స్‌ పాడుతుండగా మిల్లర్‌ స్టేజ్‌ పైకి ఎక్కి ఆమెతో అసభ్య పదజాలంతో ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమె ఒంటిపై చేతులు వేస్తూ  లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడిని అడ్డుకోవడానికి వచ్చిన మేనేజర్‌ కూడా దాడికి యత్నించాడు.

ఇక మిల్లర్‌కు సదరు యువతి ఎదురు తిరగడంతో ఆమె చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ని లాక్కొని అసభ్యంగా దూషించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బార్‌ యాజమాన్యం మిల్లర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు 500 డాలర్లు జరిమానా విధించారు. ప్రస్తుతం అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా యంగ్‌ హీరోగా ఇప్పుడిప్పుడే హిట్స్‌ అందుకుంటున్న మిల్లర్‌ ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement