హాలీవుడ్‌ దర్శకుడు అలెన్‌ పార్కర్‌ మృతి

Film Director Alan Parker pass away - Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు అలెన్‌ పార్కర్‌ (76) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ‘బగ్స్‌ మాలోనే, మిడ్‌ నైట్‌ ఎక్స్‌ ప్రెస్, ఎవిత, ఫేమ్, ద కమిట్‌మెంట్స్‌’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు అలెన్‌. ఆయన 14 సినిమాలు తెరకెక్కించారు. వాటిలో  సుమారు 19 బాఫ్తా అవార్డులు, పది గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు, 6 అకాడమీ అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ఉన్నాయి. అలెన్‌ మృతి పట్ల పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top