Fatima Sana Shaikh Latest Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Viral Pics: నటి ఫొటో షూట్‌.. సెలబ్రిటీలు ఫిదా!

Jul 19 2021 4:40 PM | Updated on Jul 19 2021 7:26 PM

Fatima Sana Shaikh Photoshoot Viral Ira Khan Calls Her Like This - Sakshi

ఫాతిమా సనా షేక్‌ తాజా ఫొటోషూట్‌.. నిప్పు రాజేస్తున్నావ్‌ అంటూ కామెంట్లు

Fatima Sana Shaikh Viral Pics: ఫాతిమా సనా షేక్‌...  గత కొన్నిరోజులగా ఈ బాలీవుడ్‌ బ్యూటీ పేరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. స్టార్‌ జంట ఆమిర్‌ ఖాన్‌- కిరణ్‌రావు దంపతుల విడాకులకు ఈ భామనే కారణమంటూ కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు. దంగల్‌లో ఆమిర్‌ కూతురిగా నటించిన ఫాతిమా.. ఇప్పుడు అతడితో కలిసి జీవితం పంచుకోబోతుందంటూ ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లేస్తున్నారు. అయితే, ఈ విషయాలపై ఫాతిమా ఇంతవరకు నేరుగా స్పందించడంతో.. ‘‘నిజమే కాబోలు.. అందుకే మౌనంగా ఉంది’’ అంటూ కొంతమంది కామెంట్‌ చేస్తుండగా.. ఆమె అభిమానులు మాత్రం.. ఫాతిమా ఇలాంటి చెత్త విషయాలపై స్పందించదు అని ఆమెను వెనకేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఫాతిమా సనా షేక్‌ ఇటీవల వరుస ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. క్రాప్‌ టాప్‌నకు జీన్స్‌ జతచేసి సింపుల్‌ డ్రెస్సింగ్‌తోనే హీట్‌ పెంచుతూ ఫాలోవర్లను ఫిదా చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె షేర్‌ చేసిన ఫొటోలు నెటిజన్లతో పాటు సెలబ్రిటీలను కూడా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్‌ నటులు అనిల్‌ కపూర్‌, సాన్యా మల్హోత్రా.. ‘‘నిప్పు రాజేస్తున్నావ్‌’’ అంటూ ఫైర్‌ ఎమోజీలను జత చేయగా.. ఆమిర్‌ కూతురు ఇరా ఖాన్‌.. ‘‘ఎంత అందంగా ఉన్నావో నువ్వు’’ అని కామెంట్‌ చేసింది. 

ఫాతిమా ఫొటోపై ఇరా కామెంట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ‘‘మీ నాన్నకు, నీకూ ఇద్దరికీ నచ్చేశాక ఇంకేముంది. ఫాతిమాను కుటుంబంలోకి ఆహ్వానించినట్లేనా’’ అని ఇష్టారీతిన ట్రోల్‌ చేస్తున్నారు. కాగా దంగల్‌, థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా సనా షేక్‌.. నెట్‌ఫ్లిక్స్‌ యాంథాజలీ అజీబ్‌ దస్తాన్స్‌లో చివరిసారిగా కనిపించింది. వీటితో పాటు లేడీస్‌ స్పెషల్‌, అగ్‌లే జనమ్‌ మోహె బితియా హీ కీజో వంటి టీవీ షోలలోనూ తళుక్కుమంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement