అమ్మతో ఉన్న ఫొటో షేర్‌ చేసిన హృతిక్‌... తడి గోడను పట్టేసిన నెటిజన్‌

Fan Spots Damp Wall Hrithik Roshan Rented House - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్ పేరు తెలియని భారతీయ సినీప్రియులు లేరనే చెప్పాలి. ఆయన్ను బాలీవుడ్‌లో గ్రీకువీరుడు అని పిలుస్తుంటారు. క్రిష్‌ సిరీస్‌లో నటించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించాడు. అప్పటి వరకూ బాలీవుడ్‌ మాత్రమే ఎక్కువ తెలిసిన ఈ కండల వీరుడు సూపర్‌ హీరో సినిమాలతో ఇండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఆయన ఇంట్లో తడి గోడ హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన వివరణ ఇవ్వడంతో అది వైరల్‌గా అయ్యింది.

హృతిక్ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలిసిందే. అయితే ఆయన బుధవారం తన తల్లి పింకీ రోషన్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తర్వాత ఓ ఫోటోను పోస్ట్‌ చేశాడు. ఆ సమయంలో ఆమె బాల్కనీలో నుంచి బయటకు చూస్తోంది. ఈ ఫోటో వైరల్‌గా మారింది. అయితే ఓ అభిమాని మాత్రం గోడ తడిగా ఉన్న విషయం గుర్తించి కామెంట్‌ పెట్టాడు.

దీనిపై స్పందించిన హీరో తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్లు, త్వరలో సొంత ఇంటికి మారబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా తడి ఉంటే కదా దాన్ని రిపేర్‌ చేసే విధానాన్ని ఎంజాయ్‌ చేయెచ్చని అన్నాడు. అయితే గతంలో జుహులోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దె ఉంటున్న ఈ అందగాడు దానికి రూ.8.25 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు ముంబైలోని ఓ మీడియా తెలిపింది. అనంతరం ఆయన మొత్తం 97.5 కోట్ల విలువ చేసే అపార్ట్‌మెంట్స్‌ కొన్నట్లు అదే మీడియా రాసుకొచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top