Erica Fernandes Opens Up On Body Shaming 'They Want Voluptuous Women', Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

erica fernandes: నేను సన్నగా ఉంటానని అలా చేసేవారు, అవమానంగా అనిపించేది

Feb 7 2022 7:36 AM | Updated on Feb 7 2022 8:15 AM

Erica Fernandes: They Want Voluptuous Women - Sakshi

నా శరీరంపై ప్యాడ్స్‌ పెట్టి మేనేజ్‌ చేయడానికి ప్రయత్నించేవాళ్లు. వాళ్లు అలా చేస్తుంటే నాకు మహా సిగ్గుగా అనిపించేది. చాలా అవమానంగా ఫీలయ్యేదాన్ని.

ఇండస్ట్రీలో ఎంతోమంది బాడీ షేమింగ్‌కు గురయ్యారు. సన్నగా ఉంటే బొద్దుగా ఉండాలని, బొద్దుగా ఉన్నవారినేమో కాస్త సన్నబడాలని నటీమణుల మీద ఒత్తిడి తెచ్చేవారు. ఇలాంటి పరిస్థితే నటి ఎరికా ఫెర్నాండేజ్‌కు ఎదురైందట. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

'అప్పట్లో సౌత్‌లో హీరోయిన్లు కొంత బొద్దుగా ఉంటే ఇష్టపడేవారు. నేనేమో సన్నగా ఉండేదాన్ని. అందుకని నా శరీరంపై ప్యాడ్స్‌ పెట్టి మేనేజ్‌ చేయడానికి ప్రయత్నించేవాళ్లు. వాళ్లు అలా చేస్తుంటే నాకు మహా సిగ్గుగా అనిపించేది. చాలా అవమానంగా ఫీలయ్యేదాన్ని. ప్యాడ్స్‌ పెట్టుకుని నటించేందుకు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉండేది. వాళ్లు కోరుకున్నట్లు నేను లేనేంటా అని చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరినీ యాక్సెప్ట్‌ చేస్తున్నారు. అది సంతోషకరమైన పరిణామం' అని  ఎరికా చెప్పుకొచ్చింది.

కాగా 2011లో పాంటలూన్స్‌ ఫెమినా మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌, 2010, 2011లో పాంటలూన్స్‌ ఫెమినా మిస్‌ మహారాష్ట్ర అవార్డులు గెలుచుకుంది ఎరికా ఫెర్నాండేజ్‌. ఇక సినిమాల విషయానికి వస్తే 'గాలిపటం' సినిమాలో కథానాయికగా అలరించిన ఎరికా పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లోనూ 'కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసేభీ' చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement