డ్రగ్స్‌ కేసు: క్షితిజ్‌ రవి ప్రసాద్‌ కస్టడీ పొడిగింపు

Drug Case: Mumbai High Court Extended Kshitij Ravi Prasad Custody - Sakshi

ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో సంబంధముందని భావిస్తున్న నిర్మాత క్షితిజ్‌ రవి ప్రసాద్‌ కస్టడీని ముంబై హైకోర్టు పొడిగించింది. మరింత సమాచారం రాబట్టేందుకు, ఇప్పటి వరకూ వెల్లడించిన విషయాలను నిర్ధారించుకోవడానికి కస్టడీని పొడిగించాలంటూ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో కోరింది. అందుకు కోర్టు అక్టోబర్‌ 3 వరకూ అనుమతి ఇచ్చింది. అయితే శనివారం ఎన్‌సీబీ అధి​కారులు నిర్మాత ప్రసాద్‌ను శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
(చదవండి: డ్రగ్స్ ‌కేసులో చిక్కుకున్న బడా ప్రొడ్యూసర్)‌

అతడిని విచారించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్‌సీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. ఇటీవల పట్టుకున్న డ్రగ్స్‌ కేసులో నిందితుడైన అనుజ్‌ కేశ్వానితో ప్రసాద్‌కు పరోక్షంగా సంబంధం ఉందని ఎన్‌సీబీ చెప్పడంతో ఆయనకు కస్టడీ తప్పలేదు. నటుడు సుశాంత్‌ మరణంతో సంబంధం ఉన్న నిందితులతో కూడా ప్రసాద్‌కు డ్రగ్స్‌ సంబంధాలు ఉన్నాయని ఎన్‌సీబీ కోర్టుకు తెలిపింది. ప్రసాద్‌ గతంలో సినీ నిర్మాత కరణ్‌ జోహార్‌ వద్ద పని చేశారు. అయితే ప్రసాద్‌ నుంచి స్టేట్‌మెంట్‌ కోసం అధికారులు వేధించారని, బ్లాక్‌మెయిల్‌ చేశారని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ప్రసాద్‌ లాయర్‌ సతీష్‌ మనెషిండె కోర్టుకు తెలిపారు.
(చదవండి: మీడియాపై ఆగ్రహం.. కరణ్‌కు మద్దతు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top