Super Star Krishna: కృష్ణ నటించిన చివరి చిత్రం ఏదంటే?

Do You Know Super Star Krishna Last Film - Sakshi

ఆకాశంలో ఒక తార అంటూ సినీ ప్రియులను ఓ ఊపు ఊపిన నటుడు కృష్ణ అందరినీ విషాదంలో ముంచుతూ నేడు నింగికేగాడు. ఆయన మరణాన్ని జీర్ణించుకోవడం ఘట్టమనేని కుటుంబానికే కాదు యావత్‌ తెలుగు ప్రేక్షకులకు భారంగా మారింది. దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి ఔరా అనిపించారాయన. ఒక్క హీరోగానే 350 సినిమాలు చేశారు. ఎక్కువ మల్టీస్టారర్‌ సినిమాలు చేసిన రికార్డు కూడా కృష్ణ పేరు మీదే ఉంది. కెరీర్‌ మొత్తంలో 50 మల్టీస్టారర్‌ మూవీస్‌ చేశారు. మరి ఆయన నటించిన చివరి చిత్రం ఏంటో తెలుసా?

శ్రీశ్రీ.. ముప్పలనేని దర్శకత్వంలో వచ్చిన శ్రీశ్రీ సినిమా 2016లో విడుదలైంది. ఇందులో విజయ నిర్మల, నరేశ్‌, సాయికుమార్‌, మురళీ శర్మ, పోసాని కృష్ణ నటించారు. ఆ తర్వాత సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు కృష్ణ. శ్రీశ్రీ చిత్రానికి ముందు సుకుమారుడు సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. అదే ఏడాది శ్రీకాంత్‌, ఛార్మి కాంబినేషన్‌లో వచ్చిన సేవకుడు సినిమాలోనూ అతిథి పాత్రలో కనిపించారు.

చదవండి: తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతమైన మహేశ్‌బాబు
బాగా కావాల్సినవాళ్లంతా దూరమైపోతున్నారు: మహేశ్‌బాబు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top