సెప్టెంబర్ 17న నితిన్‌ మాస్ట్రో: హాట్‌స్టార్‌ ప్రకటన

Disney Plus Hotstar Official Announced Nithin Maestro Streaming On 17th September - Sakshi

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో సెప్టెంబ‌ర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా డిస్నీహాట్ స్టార్ సంస్థ దీనిపై అధికారిక ప్రకట ఇచ్చింది.  హీరో నితిన్‌ ఇది 30వ చిత్రం. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను తెలియ‌జేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో నితిన్ న‌ల్ల‌టి క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి చేతిలో క‌ర్ర ప‌ట్టుకుని న‌డుస్తున్నాడు.

చదవండి: పవన్‌ ఫ్యాన్స్‌కు బండ్ల గణేశ్‌ గుడ్‌ న్యూస్‌.. థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్‌ సింగ్‌’

ఈ సినిమాలోని ప్రధాన తారాగణంతో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. మేర్ల‌పాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర‌ పోషించింది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి-నికిత రెడ్డిలు ఈ మూవీని నిర్మించారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top