RGV Rleases the First Look Poster and Release Date of 'Disha Encounter' Movie | 'దిశ ఎన్‌కౌంట‌ర్‌' పోస్ట‌ర్ రిలీజ్‌ - Sakshi
Sakshi News home page

దిశ ఎన్‌కౌంట‌ర్‌: పోస్ట‌ర్ రిలీజ్‌

Sep 5 2020 1:38 PM | Updated on Sep 5 2020 3:23 PM

Disha Encounter: First Look Poster Released - Sakshi

కాదేది సినిమాకు అన‌ర్హం అన్న‌ట్లుగా.. స‌మాజంలో జ‌రిగే ప్ర‌ధాన‌ అంశాలు అన్నింటిపైనా సినిమాలు తీసుకుంటూ పోతున్నారు ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన దిశ హ‌త్యోదంతంపై సినిమా తీస్తాన‌ని వ‌ర్మ గ‌తంలోనే ప్ర‌క‌టించారు. చెప్పిన‌ట్లుగానే ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో ఓ యువ‌తి స్కూటీతో పాటు, నిందితుడు పారిపోతూ ఉండ‌టం, వారిని ఎన్‌కౌంట‌ర్‌ చేసేందుకు ఓ తుపాకీ గురి పెట్టి ఉండ‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అలాగే సినిమాలో నేర‌స్థులు వినియోగించే లారీ కూడా ఉంది. ఈ చిత్రాన్ని అనురాగ్ కాస‌ర్ల నిర్మిస్తున్నారు. (చ‌ద‌వండి: నాగార్జున ఏం తింటున్నారో: వర్మ)

కాగా గ‌తేడాది న‌వంబ‌ర్ 26న న‌లుగురు నిందితులు ఓ యువ‌తిని ల‌క్ష్యంగా చేసుకుని ఆమెపై అత్యాచారం చేసి నిప్పు పెట్టిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే ఈ ఘ‌ట‌న‌పై సినిమా తీస్తాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించారు. అంతే కాకుండా దిశ కేసులో నిందితుడైన చెన్న‌కేశ‌వులు భార్య‌ను క‌లిశారు. అదేవిధంగా శంషాబాద్ పోలీసుల‌ను కూడా క‌లుసుకున్నారు. ఆ కేసు గురించి పూర్తి వివ‌రాలు సేక‌రించిన వ‌ర్మ సినిమా చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి చేశాడు. ఈ క్ర‌మంలో శ‌నివారం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ ద్వారా క‌థ మొత్తాన్ని ఒక్క ముక్క‌లో తెలియ‌జేశాడు. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ సెప్టెంబ‌ర్ 26న విడుద‌ల చేయ‌నున్నారు. సినిమా న‌వంబ‌ర్ 26న రిలీజ్‌ కానుంది. (చ‌ద‌వండి: తెరపైకి ఆర్జీవీ జీవితం)

Advertisement
 
Advertisement
Advertisement