Director Teja Said He Wants To Introduce His Son As Hero, Deets Inside - Sakshi
Sakshi News home page

Director Teja : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్‌ తేజ కుమారుడు

May 23 2023 2:23 PM | Updated on May 23 2023 3:00 PM

Director Teja Said He Wants To Introduce His Son As Hero - Sakshi

ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంతో తనదైన మార్క్‌ చూపించిన దర్శకుల్లో డైరెక్టర్‌ తేజ ఒకరు. తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష‍్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి వంటి పలు హిట్‌ చిత్రాలు తెరకెక్కించిన ఆయన రీసెంట్‌గా అహింస అనే సినిమాను రూపొందించారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు.

గతంలోనూ అనేకమంది నటీనటులను డైరెక్టర్‌ తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ తన కొడుకు ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నా. తనకు ఇంట్రెస్ట్‌ ఉండటంతో విదేశాల్లో అందుకు సంబంధించిన కోర్సులు చేసి వచ్చాడు.

చూడటానికి హ్యాండ్సమ్‌గానే ఉంటాడు. కానీ హీరోగా చేయడానికి అదొక్కటే సరిపోదు కదా.. ఇక మా అబ్బాయిని నేను డైరెక్ట్‌ చేయాలా లేక ఇంకెవరికైనా అప్పగించాలా అన్నది చూడాల్సి ఉంది అంటూ తేజ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement