
గ్రామీణ కథా చిత్రాలకు ట్రేడ్ మార్క్ దర్శకుడు ముత్తయ్య. ఈయన ఇంతకుముందు పులికుట్టి, కొంబన్ విరుమాన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది తెలిసిందే. తాజాగా మరోసారి మధురై నేపథ్యంలో తనదైన శైలిలో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందు శశికుమార్, ఆర్య, కార్తీ, విశాల్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలు చేసిన ముత్తయ్య ఈసారి తన వారసుడు విజయ్ ముత్తయ్యను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు.
దర్శిని, బ్రిగిడ సాగా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం గురువారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం కూడా తన గత చిత్రాల తరహాలో గ్రామీణ నేపథ్యంలో సాగుతుందన్నారు హీరోయిన్స్‌గా. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను మదురై జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు.
ఇందులో పూర్తిగా కొత్త తారలు నటిస్తున్నట్లు తెలిపారు. చిత్రంలోని ఒక ముఖ్యమైన ఫైట్ సన్నివేశం కోసం భారీ సెట్ వేసినట్లు చెప్పారు. ఈ మూవీని కేకేఆర్ శ్రీనివాస్ పతాకంపై రమేష్ పాండే నిర్మిస్తున్నారు. దీనికి ఎం సుకుమార్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు.