muthaiah
-
టాప్ డైరెక్టర్ తనయుడు హీరోగా లాంచ్.. ఆ మూవీలో హీరోయిన్స్ ఎవరంటే?
గ్రామీణ కథా చిత్రాలకు ట్రేడ్ మార్క్ దర్శకుడు ముత్తయ్య. ఈయన ఇంతకుముందు పులికుట్టి, కొంబన్ విరుమాన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది తెలిసిందే. తాజాగా మరోసారి మధురై నేపథ్యంలో తనదైన శైలిలో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందు శశికుమార్, ఆర్య, కార్తీ, విశాల్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలు చేసిన ముత్తయ్య ఈసారి తన వారసుడు విజయ్ ముత్తయ్యను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. దర్శిని, బ్రిగిడ సాగా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం గురువారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం కూడా తన గత చిత్రాల తరహాలో గ్రామీణ నేపథ్యంలో సాగుతుందన్నారు హీరోయిన్స్‌గా. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను మదురై జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇందులో పూర్తిగా కొత్త తారలు నటిస్తున్నట్లు తెలిపారు. చిత్రంలోని ఒక ముఖ్యమైన ఫైట్ సన్నివేశం కోసం భారీ సెట్ వేసినట్లు చెప్పారు. ఈ మూవీని కేకేఆర్ శ్రీనివాస్ పతాకంపై రమేష్ పాండే నిర్మిస్తున్నారు. దీనికి ఎం సుకుమార్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: 'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు -
కార్తీ నా కంటే మంచి నటుడు: హీరో సూర్య
నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విరుమన్. ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హీరో సూర్య నిర్మించిన ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ఎస్.కె.సెల్వకుమార్ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి మధురైలో చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. సీనియర్ దర్శకుడు భారతీరాజా, రాజ్యసభ సభ్యుడు వెంకటేశన్ అతిథులుగా పాల్గొన్నారు. దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన ఏ చిత్రానికీ ఆడియో విడుదల వేడుక జరగలేదన్నారు. కానీ ఈసారి ఇలా వేడుక జరిపినందుకు సూర్య, జ్యోతిక, కార్తీ, 2డీ సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కథానాయికగా అవకాశం ఇచ్చిన సూర్య, కార్తీకి హీరోయిన్ అదితి శంకర్ థ్యాంక్స్ చెప్పారు. ఆమె ఈ చిత్రంలో ఒక పాట పాడటం విశేషం. కార్తీ మాట్లాడుతూ తన తొలి చిత్రం పరుత్తివీరన్ షూటింగ్ ఇక్కడే జరిగిందన్నారు. ఇంతకుముందు ముత్తయ్య దర్శకత్వంలో మధురై నేపథ్యంలో కొంబన్ చిత్రంలో నటించానని, ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నారు. రెండవసారి విరుమన్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. సూర్య మాట్లాడుతూ మధురై మన్నులో కథలకు కొరతే లేదన్నారు. పలుమార్లు ఇక్కడికి వచ్చి ప్రేమాభిమానాలను పొందానన్నారు. అలాంటి ఈ గడ్డపై విరుమన్ చిత్ర ఆడియో వేడుక జరపడం గర్వంగా భావిస్తున్నానన్నారు. ఇక్కడ కథల్లో జీవం ఉంటుందన్నారు. కార్తీ నా కంటే మంచి నటుడు అని కొనియాడారు. ఆదితి శంకర్ నటిగా మెప్పించారన్నారు. తనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించిన సమయంలో తాను తన పిల్లల విద్య విషయమై న్యూయార్క్‌లో ఉన్నానని, ఆ విషయం తెలియడానికి తనకు నాలుగు గంటలు పట్టిందన్నారు. అంతకు ముందే మీడియా ఆ వార్తను గ్లోబలైజేషన్ చేయడం సంతోషం కలిగించిందని తెలిపారు. చదవండి: విజయ్ దేవరకొండతో లవ్? మరోసారి క్లారిటీ ఇచ్చిన రష్మిక ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు! -
'మత్తయ్యకు షెల్టర్ ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలి'
* ‘ఓటుకు కోట్ల’ ఉదంతంపై చంద్రబాబుకు వైఎస్సార్సీపీ సూటిప్రశ్న * బాబుది నేరమే: పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి ఆకుల మూర్తి సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్ల వ్యవహారంలో తన ప్రమేయం లేదని, స్టీఫెన్‌సన్‌తో తాను మాట్లాడలేదని, టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పట్లేదని వైఎస్సార్సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఆకుల మూర్తి ప్రశ్నించారు. చంద్రబాబు నేరం చేశారన్నది పక్కా నిజమని, ఆయన ఇకనైనా ఈ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం మాని ఏపీ అభివృద్ధిని కోరుకుంటే సీఎం పదవికి రాజీనామా చేసి దర్యాప్తునకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. దిగజారిన రాజకీయ విలువలకు ప్రతీకగా నిలిచిన ఈ వ్యవహారంలో ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేసినందుకు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి సత్తా చాటుకుని మెజారిటీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యవహారమంతా వీడియో, ఆడియో టేపుల రూపంలో ప్రజల కళ్లెదుట కనిపిస్తుంటే దీని వెనక సీఎం కేసీఆర్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలసి కుట్ర పన్నారని టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్‌ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు. మత్తయ్య వెనుక ఎవరున్నారు, ఆయనకు ఆశ్రయం ఎవరిచ్చారనే అంశాలతోపాటు ముడుపుల వ్యవహారంలో ఆయన పాత్రపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలోని ప్రాజెక్టులను జగన్ వ్యతిరేకించలేదని, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన అనుమతులు, నీటి లభ్యతకు అనుగుణంగానే ప్రాజెక్టులు కట్టాలని, ఏ ప్రాజెక్టు కట్టినా సక్రమంగా ఉండాలని మాత్రమే చెప్పారన్నారు. -
'నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి'
-
'నేనెక్కడికి పారిపోలేదు, ఫోన్ నెంబర్ తెలుసుగా'
హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ను బలిపశువును చేశారని ఈ కేసులో ఎ4 నిందితుడిగా ఉన్న మ్యాథ్యూ జరుసలేం అలియాస్ మత్తయ్య ఆరోపించారు. దళితుడైన స్టీఫెన్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విషయంలో తాను ఎలాంటి మధ్యవర్తిత్వం నడపలేదని ఆయన తెలిపారు. స్టీఫెన్ సన్ను భయపెట్టి, రేవంత్ రెడ్డిని పట్టివ్వాలని బెదిరించారని, ఆ కుట్రలో తమ ఎమ్మెల్యేను పావుగా చేశారని అన్నారు. మరోవైపు తాను పరారీలో ఉన్నట్లు వచ్చిన వార్తలను మత్తయ్య తీవ్రంగా ఖండించారు. తాను అజ్ఞాతంలో లేనని, పరారీలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, ఇంట్లోనే ఉన్నానని, తన ఫోన్ కూడా ఆన్‌లోనే ఉందన్నారు. తన ఫోన్ నెంబర్ ఏసీబీ అధికారులకు తెలుసునని, అలాంటిది తనకు ఫోన్ చేసి మత్తయ్య ఎక్కడున్నావ్ అని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఏసీబీ అధికారులకు తనను అడిగే దమ్ము, ధైర్యం లేదా అని అడిగారు. దళిత క్రైస్తవ వ్యతిరేకి అయిన కేసీఆర్ కుట్రలో ఏసీబీ అధికారులు, పోలీసులు పావులుగా మారారని ఆరోపించారు. అగ్రవర్ణ, అధికార దాహం ఉన్న కేసీఆర్ తనకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. తనను ముద్దాయిగా చేసి బలి చేస్తున్నారని మత్తయ్య మండిపడ్డారు. ప్రభుత్వం కుట్రను ప్రజలకు తెలిపేందుకు తాను శిక్షకు సైతం సిద్ధమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్‌ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రేవంత్ 50 లక్షల రూపాయలను స్టీఫెన్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.