డింపుల్‌ హయత్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌.. స్టార్‌ హీరోతో సినిమా | Sakshi
Sakshi News home page

డింపుల్‌ హయత్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌.. స్టార్‌ హీరోతో సినిమా

Published Sat, Dec 2 2023 5:05 PM

Dimple Hayati Get Vijay Sethupathi Movie Chance - Sakshi

కోలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించిన నటుడు విజయ్‌సేతుపతి. ఆ తరువాత కథానాయకుడు స్థాయికి ఎదిగారు. అలా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న ఈయన ఆ తరువాత ప్రతినాయకుడిగానూ సత్తా చాటుతూ వచ్చారు. ఇటీవల హిందీ చిత్రం జవాన్‌లో షారూఖ్‌ఖాన్‌తో ఢీకొని సక్సెస్‌ అయ్యారు. మళ్లీ వరుసగా కథానాయకుడు పాత్రలో నటిస్తున్న విజయ్‌సేతుపతి ఇకపై విలన్‌గా నటించనని స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

అలా ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి 'ట్రైన్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మిష్కిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజాకార్యక్రమాలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఇది స్వతంత్య్ర నేపథ్యంలో సాగే ట్రైన్‌ ట్రావెలింగ్‌ కథా చిత్రం కావడంతో దీనికి ట్రైన్‌ అనే టైటిల్‌ నిర్ణయించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో విజయ్‌సేతుపతి సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు.

ఇందుకోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో డింపుల్‌ హయత్‌ చాలా ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఈరా దయానంద్, నాజర్, భావన, బట్లు పృథీరాజా, కేఎస్‌ రవికుమార్, రూడీసేతు, గణేష్‌ వెంకట్రామన్, కనిహా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్‌నే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పాసియా పాతిమా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి దర్శకుడు వెట్రిమారన్, నాజర్, నిర్మాత మురళిరామస్వామి, రాధాకృష్ణన్, ఎస్‌.కదిరేశన్, అన్బుచెలియన్‌ హాజరై యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement