
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఒకవైపు తన బ్యానర్లో రాబోతున్న సినిమా పనులు, మరోవైపు ఎఫ్‌డీసీ చైర్మన్ బాధ్యతలతో నిత్యం బిబీ బిబీగా ఉండే దిల్ రాజు.. ఖాలీ సమయం దొరికితే మాత్రం ఫ్యామిలీతో బయటకు వెళ్తుంటాడు. ఆయనకు దైవభక్తి కాస్త ఎక్కువే. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి అంటే ఆయనను చాలా ఇష్టం. అందుకే సొంతూరిలో గుడిని సైతం నిర్మించాడు. వీలు ఉన్నప్పుడల్లా భార్య,కొడుకుతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్తుంటాడు.
తాజాగా తన కొత్త ఇంట్లో శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాడు దిల్ రాజు. పూజ అనంతరం సతీమణి తేజస్వినితో కలిసి సంప్రదాయం ప్రకారం నృత్యం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
దిల్ రాజు, తేజస్వినిల వివాహం 2020లో జరిగింది. దిల్రాజుకు ఇది రెండో వివాహం. మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించింది. కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న దిల్ రాజు.. 2020లో తేజస్వీని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022 బాబు పుట్టాడు. పేరు అన్వీరెడ్డి.