Dia Mirza Emotional Post About Her Son Premature Birth: 2021 సంవత్సరం వెళ్లిపోయి న్యూ ఇయర్ 2022 రాబోతుంది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు ఈ ఏడాది తమ జీవితంలో ఏర్పడిన విశేషాలు, కలిగిన కష్టాలు, బాధలను పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా శుక్రవారం (డిసెంబర్ 31)న 2021లోని మధురమైన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనను తల్లిగా మార్చిన ఈ ఇయర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది దియా. ఈ ఏడాది అంతులేని ఆనందాన్ని పొందానని ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌లో 'ఈ సంవత్సరం చావు అంచుల వరకు వెళ్లినా కూడా అంతులేని ఆనందాన్ని పొందాను. నా కొడుకు నెలలను నిండక ముందే పుట్టి కొన్ని పరీక్షలు పెట్టాడు. కానీ పాఠాలు నేర్చుకున్నాను. గొప్ప పాఠం. కష్టతరమైన కాలాన్ని అనుభవించా.' అని రాసుకొచ్చింది.

అయితే దియా కుమారుడు అవ్యాన్ ఆజాద్ రేఖీ అత్యవసర పరిస్థుతుల వల్ల నెలలు నిండకముందే జన్మించాడు. మే 15న నియోనాటల్ ఐసీయూలో సీ-సెక్షన్ ద్వారా అవ్యాన్‌కు జన్మనిచ్చింది దియా. అనంతరం వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. 'నా గర్భధారణ సమయంలో ఆకస్మిక అపెండెక్టమీ తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు దారి తీసింది. అది చాలా ప్రమాదకరమైనది అని వైద్యులు తెలిపారు. వైద్యుల సకాలంలో స్పందించడంతో నా కొడుకుకు సురక్షితంగా జన్మనివ్వగలిగాను.' అని 40 ఏళ్ల దియా జూలైలో తెలిపింది.
ఇదీ చదవండి: ఆటో రిక్షా నడిపిన సల్మాన్ ఖాన్.. నెటిజన్ల ట్రోలింగ్..


