ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బీభత్సమైన అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని బీ,సీ సెంటర్లలోనూ హవా చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు నుంచి వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఊహించని రికార్డులు సొంతం చేసుకుంది. ఇంతకీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
(ఇదీ చదవండి: ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్)
తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి 'ధురంధర్ 2' చిత్రానికి రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే కేవలం మన దేశంలోనే రూ.115 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదో రికార్డ్. ఇప్పటివరకు వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' రూ.762 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దీని తర్వాతి స్థానంలోకి 'ధురంధర్ 2' వెళ్లింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.500 కోట్లు) తదితర రికార్డులు బ్రేక్ చేసింది.
మరోవైపు బాలీవుడ్‌లోనూ ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ 'పఠాన్' పేరిట రూ.287 కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ఉంది. దీన్ని 'ధురంధర్ 2' అధిగమించడంతో పాటు సరికొత్త ఘనత సాధించింది. చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ చిత్ర రచ్చ ఆగేలా లేదు. తొలి వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించడం పక్కా అనిపిస్తుంది. అలానే రూ.2000 కోట్ల మార్క్‌ని కూడా త్వరలోనే అందుకునే అవకాశముందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)


