మంచి కాన్సెప్ట్‌ అనిపిస్తోంది | Dhostan First look Poster Released by minister Harish rao | Sakshi
Sakshi News home page

మంచి కాన్సెప్ట్‌ అనిపిస్తోంది

Published Thu, Oct 13 2022 1:05 AM | Last Updated on Thu, Oct 13 2022 1:05 AM

Dhostan First look Poster Released by minister Harish rao - Sakshi

సిద్‌ స్వరూప్, కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ ప్రధాన పాత్రల్లో సూర్యనారాయణ అక్కమ్మ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘దోస్తాన్‌’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు రిలీజ్‌  చేసి, మాట్లాడుతూ – ‘‘ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథను సెలక్ట్‌ చేసుకుని చిత్ర యూనిట్‌ సినిమా తీశారని అనిపిస్తోంది.

ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చి, నిర్మాత సూర్యనారాయణకు పెద్ద హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘సిద్‌ స్వరూప్‌ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు సూర్యనారాయణ. ‘‘మంచి కాన్సెప్ట్‌ ఉన్న సినిమాలో నటించే చాన్స్‌ ఇచ్చిన సూర్యనారాయణ అక్కమ్మగారికి థ్యాంక్స్‌’’ అన్నారు సిద్‌ స్వరూప్‌.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement