రెండో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి.. పిక్స్ వైరల్

Dalljiet Kaur finally tied the knot with Nikhil Patel on Saturday - Sakshi

బాలీవుడ్ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని జరిగిన ఈ వేడుకలో ఆమె నిఖిల్ పటేల్‌ను వివాహమాడారు. తాజాగా వీరిపెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అంతకు ముందు జరిగిన మెహందీ, సంగీత్ వేడుకల్లో పలువురు నటీనటులు పాల్గొని సందడి చేశారు.

ఇటీవలే బిగ్ బాస్- 16లో పాల్గొన్న నటుడు షాలిన్ భానోత్‌ను దల‌్జీత్ కౌర్ ఇదివరకే వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత తన కుమారుడు జేడన్‌తో కలిసి కెన్యాలోని నైరోబీకి మారనున్నారు దల్జీత్ కౌర్. 2014లో దల్జీత్, షాలిన్‌లకు బాబు జన్మించారు. ఆమె ఫిబ్రవరిలోనే  నిఖిల్‌ పటేల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.  

అయితే నిఖిల్‌ పటేల్‌కు ఇదివరకే పెళ్లి కాగా.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. పదమూడేళ్ల అరియానా, ఎనిమిదేళ్ల ఆనిక ఆయన సంతానం. మెహందీ ఫంక్షన్‌లో ఇద్దరు అమ్మాయిలు పాల్గొన్నారు. కాగా.. నిఖిల్‌ను దుబాయ్‌లో ఓ పార్టీలో కలిసిన దల్జీత్ కౌర్.. ఆ తర్వాత జనవరిలో నేపాల్‌లో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top