నలభై టు నాలుగు! | COVID-19: Tamannah taking baby steps to regain stamina | Sakshi
Sakshi News home page

నలభై టు నాలుగు!

Oct 29 2020 2:33 AM | Updated on Oct 29 2020 2:33 AM

COVID-19: Tamannah taking baby steps to regain stamina - Sakshi

తమన్నా ఫిట్‌నెస్‌ మీద ఎంత దృష్టిపెడుతుంటారో తెలిసిందే. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉంటారు. షూటింగ్స్‌తో సంబంధం లేకుండా ఆమె డైలీ రొటీన్‌లో వర్కౌట్స్‌ ఓ భాగం. లాక్‌డౌన్‌లోనూ వ్యాయామం చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ని కూడా ఫిట్‌నెస్‌ మీద దృష్టిపెట్టమంటూ పోస్ట్స్‌ చేస్తుండేవారు. అయితే ఇటీవల తమన్నా  కోవిడ్‌ బారినపడ్డ సంగతి తెలిసిందే.

దాంతో వర్కౌట్స్‌కి చిన్న బ్రేక్‌ ఇచ్చారామె. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వర్కౌట్స్‌ మొదలెట్టారు. అయితే ఆమె గ్రాఫ్‌ నలభై నుంచి నాలుగుకి పడిపోయిందట. ‘‘కోవిడ్‌కి ముందు ఈజీగా 40 పుష్‌ అప్స్‌ చేసేదాన్ని. కోవిడ్‌ తర్వాత జస్ట్‌ నాలుగంటే నాలుగు చేయడం కూడా  కష్టంగా అనిపించింది. కానీ మెల్లిగా మళ్లీ పికప్‌ అయ్యాను. కోవిడ్‌ వల్ల నీరసించిపోతాం. అయినా మన స్టామినాని మళ్లీ తిరిగి తెచ్చుకోవడం ముఖ్యం’’ అన్నారు తమన్నా.

Advertisement
 
Advertisement
Advertisement